సికింద్రాబాద్ వందేభారత్ రైలును ప్రారంభించిన సమయంలో జ్యోతి మల్హోత్రా చాలా హడావుడి చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్ లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేపుతుంది. పాకిస్థాన్ కు గూఢాచర్యం చేస్తుందన్న ఆరోపణలపై జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 2023 సెప్టెంబర్ లో ప్రధాని మోదీ వర్చువల్ గా సికింద్రాబాద్ వందేభారత్ రైలును ప్రారంభించిన సమయంలో జ్యోతి మల్హోత్రా చాలా హడావుడి చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళిసైతోపాటు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో యూట్యూబర్ గా వీడియోలు చేస్తూ జ్యోతి హల్చల్ చేశారు. హర్యానాలో ఈ మధ్యే గూఢచర్యం కేసులో జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయ్యింది. అప్పటి ఆమె వీడియోలు , చిత్రాలు తాజాగా సోషల్ మీడియాలోను వైరల్ అవుతున్నాయి. అయితే హైదరాబాద్ వచ్చిన టైంలో ఆమె ఎవరినైనా కలిశారా కలిస్తే అక్కడి వీడియోలను తీశారా అనే కోణల్లో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నారు.