ఉదయం 11 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భూమిపూజ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి
న్యూస్ లైన్ , డెస్క్ : తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 11 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భూమిపూజ నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క్ మంత్రులు , ఎంపీలు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ 9 న ఆవిష్కరించడానికి సిధ్ధం చేస్తున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ మాత్రం సచివాలయంలో కాకుండా ప్రస్తుతం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టే చోట పెట్టాలని డిమాండ్ చేస్తోంది.
రాజీవ్ గాంధీ విగ్రహం గనక ఏర్పాటు చేస్తే మేం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగిస్తామని గతంలో కేటీఆర్ చాలా సార్లు చెప్పారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ పార్టీని రెచ్చగొట్టేలా.. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు సచివాలయం ముందు జరపాలని చూస్తున్నారు. తర్వాత కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగిస్తే తమ పార్టీకే నష్టం జరుగుతుందనేది రేవంత్ రెడ్డి ఆలోచన కావచ్చు. ఇప్పుడు రేవంత్ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం.. సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ లోగో.. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు విషయంలో గతంలో పలు ప్రకటనలు చేసిన సీఎం రేవంత్ సచివాలయంలో మార్చిన తెలంగాణ తల్లి విగ్రహం పెడతారా ..లేక పాత విగ్రహాన్ని పెడతారా అనేది ...ఆవిష్కరించాకే తెలుస్తుంది.