Maha Kumbh 2025 : మహాకుంభమేళాకు ఆఖరి రోజు ఎంత మంది వచ్చారంటే !


144 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళా మహాఘట్టం నేటితో ముగిసింది. జనవరి 13న మొదలైన ఈ మహా కుంభమేళా ..మహాశివరాత్రి పర్వదినంతో ముగిసింది.


Published Feb 26, 2025 07:20:00 PM
postImages/2025-02-26/1740578059_MahakumbhFev26.jpeg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: 144 ఏళ్లకోసారి వచ్చే మహా కుంభమేళా మహాఘట్టం నేటితో ముగిసింది. జనవరి 13న మొదలైన ఈ మహా కుంభమేళా మహా శివరాత్రి పర్వదినంతో ముగిసింది. మహాకుంభమేళాలో మహాశివరాత్రి రోజున 2.5 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు.


144 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళా మహాఘట్టం నేటితో ముగిసింది. జనవరి 13న మొదలైన ఈ మహా కుంభమేళా ..మహాశివరాత్రి పర్వదినంతో ముగిసింది. చివరి రోజున భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మహా కుంభమేళాలో మహాశివరాత్రి రోజున 2.5 కోట్లకు పైగా భక్తులు పవిత్రస్నానాలు ఆచరించారు. ప్రయాగ్ రాజ్ లోని సంగం ఒడ్డున 45 రోజుల పాటు జరిగిన ఈ మహాకుంభమేళాలో ఇప్పటివరకు 65 కోట్లకు పైగా పుణ్యస్నానాలు చేసినట్టు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. 


కాగా.. ఏడు శైవ అఖారాలకు, మహాకుంభ్-2025 బుధవారం నాడు గొప్ప పేష్వై ఊరేగింపుల తర్వాత కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలతో మహాశివరాత్రి నాడు ముగిసింది. పేష్వై ఊరేగింపులో భాగంగా, 10,000 మందికి పైగా నాగ సాధువులు, పండుగ ఉత్సాహాన్ని పెంచుతూ, కాశీ రోడ్ల గుండా తమ దేవతలు, జెండాలతో, త్రిశూలాలు, కత్తులు, గదలను ప్రదర్శిస్తూ ‘హర్ హర్ మహాదేవ్’ నినాదాల మధ్య పాడుతూ, నృత్యం చేస్తూ ప్రదర్శన చేశారు. మహాశివరాత్రి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతుండంతో దాదాపు 3 లక్షల కోట్లు వ్యాపారం జరిగినట్లు నేషనల్ మీడియా వార్తలు ప్రచూరించింది.కాశీ ఆలయానికి భక్తులు పోటేత్తారు.మహాశివరాత్రి వేడుకల్లో సుమారు 25 లక్షల మంది భక్తులు పాల్గొనడంతో గత రికార్డులన్నింటిని బద్దలైనట్లు అధికారులు తెలిపారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu shiva pooja mahakumbamela

Related Articles