మురుగేశుని ఆశీర్వాదం పొందడానికి వేడుకలు నిర్వహిస్తారు. ఈ టైంలో ఆలయంలో ఏటా జరిగే నిమ్మకాయ వేలం చాలాచాలా ఫేమస్.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : గణపతి లడ్డు వేలం గురించి మనకి తెలిసిందే అలానే మురుగన్ ప్రసాదం వేలం కూడా.. చాలా నార్మల్ . తమిళనాడు పుదుక్కోట్టైలో తైపూసం రోజున పళని మురుగన్ పాదాల వద్ద పూజించిన ఒక నిమ్మకాయను వేలం వేయగా ఏకంగా రూ. 5.09 లక్షలు పలికింది. అంతేకాదు స్వామి వారికి పెట్టిన నైవేద్యం పండ్లు వేలం వేయగా 16 వేల నంుచి 40 వేల వరకు పలికాయి. తైపూసం సంధర్భంగా భక్తులు దేవాలయాలలో ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. మురుగేశుని ఆశీర్వాదం పొందడానికి వేడుకలు నిర్వహిస్తారు. ఈ టైంలో ఆలయంలో ఏటా జరిగే నిమ్మకాయ వేలం చాలాచాలా ఫేమస్.
దిండిగల్ జిల్లాలోని పళనిలో ఉన్న ప్రసిద్ధ పళని మురుగన్ ఆలయంలో తైపూసం పండుగను చాలా వైభవంగా జరుపుకున్నారు. పుదుక్కోట్టై జిల్లాలో, ఒక నిమ్మకాయ వేలంలో రూ. 5.9 లక్షల భారీ ధరకు అమ్ముడైంది. ఇది తైపూసం పండుగలో ఈ నిమ్మకాయ వేలం ఒక్కటే కాదు..గుడిలో వస్తువులు ...గంటలు ...పూజా వస్తువులను వేలం వేస్తారు. ఇవి వేలంలో పొందింతే మురుగన్ ఆశీస్సులు పొందినట్లే భావిస్తారు భక్తులు. ఈ వేలానికి భక్తులు భారీగా తరలివచ్చారు.