bhakthi: పురాణాల ప్రకారం ...ఈ పనులు మధ్యలో అస్సలు వదలకూడదు !

మనిషి జీవితం ...పురాణాలల్లో చెప్పినట్లు పధ్ధతిగా ఉండాలి.అప్పుడే భక్తిమార్గంలో నడిస్తేనే మనిషి మోక్షమార్గం లభిస్తుంది


Published Mar 05, 2025 08:32:00 PM
postImages/2025-03-05/1741187110_chanakyaniti2.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మనిషి జీవితం చాలా ప్రశాతంగా ..అందంగా ..అధ్భుతంగా ఉండాలంటే మనిషి జీవితం ...పురాణాలల్లో చెప్పినట్లు పధ్ధతిగా ఉండాలి.అప్పుడే భక్తిమార్గంలో నడిస్తేనే మనిషి మోక్షమార్గం లభిస్తుంది. అయితే మనిషి గరుఢపురాణాల్లో చెప్పినట్లు కొన్ని పనులు మధ్యలో వదలకూడదు.


* చాలామంది ఎన్నో కారణాల వలన శత్రువులను పెంచుకుంటారు. అయితే శత్రుత్వాన్ని సరైన విధంగా ముగించకపోతే భవిష్యత్తులో ఎంతో నష్టం వస్తుంది. నిజానికి శత్రువులను మాట్లాడో...డబ్బులిచ్చో...క్షమాపణలు చెప్పో అందుకే శత్రుత్వాన్ని ఎంతో త్వరగా ముగించుకోవాలి.


* అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొన్ని రకాల మందులను వాడుతూ ఉంటారు. అయితే మందులను ఉపయోగించిన తర్వాత ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. కానీ అనారోగ్య సమస్య తగ్గిపోయిందని మధ్యలోనే మందులని ఉపయోగించడం ఆపకూడదు.


* కొంతమంది మంటలు వెలిగించి వెళ్లిపోతుంటారు. కాని మీరు కాని మంట వెలిగిస్తే అది ఆరిపోయే వరకు ఉండాల్సిందే.  లేకపోతే ఆ నిప్పు మరింత విస్తరించే అవకాశం ఉంది.కాబట్టి ఎప్పుడూ మంటని మధ్యలో వదిలేయకూడదు. 


* చాలా శాతం మంది డబ్బులు లేని సమయంలో అప్పును తీసుకుంటూ ఉంటారు. ఇది ఎంతో సహజం అయినా సరే కొంతమంది ఆలస్యం చేస్తూ వడ్డీను పెంచుకుంటారు. అప్పు తీర్చకుండా ఎక్కువ రోజులు ఉండకూడదు. అప్పు పెంచుకుంటూ పోతే ..ఆస్తులు కూడబెట్టలేరు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bhakthi spiritual-growth

Related Articles