అక్టోబర్ నెలలో సూర్యుడు కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంధర్భంగా తులా సంక్రమణం రోజు శ్రీ మహాలక్ష్మిని కొలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సూర్యుడు ప్రతి నెలా ఒక్కో రాశిలో ప్రవేశిస్తుంటాడు. అక్టోబర్ నెలలో సూర్యుడు కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంధర్భంగా తులా సంక్రమణం రోజు శ్రీ మహాలక్ష్మిని కొలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.
తెలుగు పంచాంగం ప్రకారం, అక్టోబర్ 17వ తేదీ ఉదయం 7:43 నిమిషాలకు సూర్యుడు కన్యారాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ ముహూర్తంలో శ్రీమహాలక్ష్మిని కొలిస్తే చాలా మంచిది.
ఈ నెల రోజులు పరమ పవిత్రంగా, శుభకరంగా భావిస్తారు. ఈ మాసంలో పగటికాలం తగ్గుతూ, రాత్రి కాలం పెరుగుతూ వస్తుంది. తులా సంక్రమణలో నదీ స్నానం చాలా మంచిది. అందులోను కావేరీ నదీ స్నానం చేస్తే ఇంకా మంచిదని అంటుంటారు. రైతులకు ఇది మంచి కాలమంటారు. రేపు ఉపవాసం ఉండి ..మహాలక్ష్మి ఆరాధన చాలా మంచిది. ఒడిశాలో ఈ రోజు ధాన్య రాశులను కొలవడం ద్వారా ధన, ధాన్యాలకు లోటుండదని భావిస్తారు. ఇతర పండుగ రోజుల మాదిరిగానే ఈ రోజు లక్ష్మీనారాయణుల, శివ పార్వతుల ఆలయాలను అందంగా అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తారు.