BHAKTHI: 13న కార్తిక మాస "క్షీరాబ్ది ద్వాదశి" తులసి పూజ ఎంతో మంచిది!

ఈ రజునే స్వామివారు తులసీ మాతను పెళ్లి చేసుకున్నారు. కాబట్టి ఆ రోజున ఇంట్లో పండుగ చేసుకోవాలి.


Published Nov 10, 2024 04:30:00 PM
postImages/2024-11-10/1731236579_tulasimahavishnucompressed.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కార్తీకమాసం మొదలైంది. అన్ని మంచిరోజులే. అయితే పరమశివునికి ఇష్టమైనవి కొన్ని రోజులు. అందులో ఈ క్షీరాబ్ధి ద్వాదశి కూడా ఒకటి.కార్తిక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని 'క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి' అని పిలుస్తారు. అమృత‌ం కోసం దేవతలు, దానవులు పాలసముద్రాన్ని ఈ రోజున చిలికారట. అసలు ఈ రోజు ఉంది కాబట్టి శ్రీ మహాలక్ష్మి, తులసీ మాత పుట్టాయని ప్రతీతి. అయితే ఆ ద్వాదశి రోజున  శ్రీహరి లక్ష్మీసమేతుడై, బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు.  ఈ రజునే స్వామివారు తులసీ మాతను పెళ్లి చేసుకున్నారు. కాబట్టి ఆ రోజున ఇంట్లో పండుగ చేసుకోవాలి.


క్షీరాబ్ది ద్వాదశి రోజు తెల్లవారుజామునే స్త్రీలు తలంటు స్నానం చేయాలి.


తులసికోట దగ్గర శుభ్రం చేసి ముగ్గులు వెయ్యండి.


ఈ ముగ్గు వేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కుటుంబంపై ఉంటుంది.


తర్వాత తులసికోట దగ్గర దీపం వెలిగించండి.


'ఓం బృందావనీయాయ నమః' అనే మంత్రంతో ప్రదక్షిణ చెయ్యండి


అలాగే ఈ రోజు తులసికోట వద్ద చలిమిడి దీపాలు వెలిగించాలి.


అన్నదానం చేస్తే చాలా మంచిది.


ఇలా మీకు వీలైనవి..అందుబాటులో ఉన్న చక్కని చిట్కాలు పాటిస్తే స్వామి కృపకు పాత్రులవుతారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bhakthi venkatewsra-temple wedding

Related Articles