దీపావళి ఆస్థానం నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చెయ్యాలని ఆ రోజున టీటీడి నిర్ణయించింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తిరుమలలో అక్టోబర్ 31 దీపావళి రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీపావళి ఆస్థానం నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చెయ్యాలని ఆ రోజున టీటీడి నిర్ణయించింది. ఆ రోజు ఎలాంటి బ్రేక్ దర్శనాలు ఉండవని టీటీడీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, దీపావళి రోజున సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను అనుమతించరు. అయితే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహాయింపు ఉంటుంది. దీనిపై టీటీడీ స్పందిస్తూ, అక్టోబరు 30న సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. కారణం దీపావళి రోజు ..ప్రత్యేకపూజలతో పాటు చాలా వరకు సిబ్బందికి సెలవు ఉంటుందని తెలిపారు.