pakistan: ఎన్ని చేసినా పాకిస్థాన్ మారదు..మరో సారి హద్దులు మీరిన పాకిస్థాన్ !

జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి ఏప్రిల్ 30 రాత్రి నుంచి 2025 మే 1 తెల్లవారుజామున పాకిస్తాన్ సైన్యం చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది. 


Published May 01, 2025 12:26:00 PM
postImages/2025-05-01/1746082656_encounterinkupwaraac88bbacdfce11e9b0cd667d8786d605.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్; పాకిస్థాన్ వరుసగా ఏడో రోజు కాల్పుల విరమణ ఉల్లంఘన పహల్గామ్ లో ఉగ్రవాద దాడి తర్వాత నియంత్రణ రేఖ దగ్గర ఉద్రికత్తల పెరిగింది. పాకిస్థాన్ పదేపదే కాల్పుల విరమణను ఉల్లఘించింది. జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి ఏప్రిల్ 30 రాత్రి నుంచి 2025 మే 1 తెల్లవారుజామున పాకిస్తాన్ సైన్యం చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది. 


ఈ కాల్పులు తరచుగా ఉద్రిక్తతకు కేంద్రంగా ఉండే కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలో జరిగాయి. పాకిస్థాన్ చర్యలకు భారత సైన్యం ధీటుగా సమాధానం చెప్తుంది. ఏప్రిల్ 29, ఏప్రిల్ 30 తేదీల మధ్య రాత్రి నౌషేరా, సుందర్‌బానీ, అఖ్నూర్ సెక్టార్లలో పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది. భారత్ సైన్యం చాలా త్వరగా రియాక్ట్ అయ్యిందని సైనిక వర్గాలు వెల్లడించాయి. 


పాకిస్తాన్ సైన్యం వరుసగా ఏడవ రోజు కూడా ఎల్‌ఓసి వద్ద కాల్పుల విరమణను ఉల్లంఘించడం గమనార్హం. పహల్గామ్ దాడి తర్వాత భారత్ 65 యేళ్ల సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. అట్టారి భూ సరిహద్దు క్రాసింగ్ ను మూసివేయడం పాకిస్థాన్ సైనిక అటాచ్ ను బహిష్కరించడం లాంటి అనేక శిక్షాత్మక చర్యలను ప్రకటించింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu fire pakistan indian-army

Related Articles