కుటుంబాలకు రూ.25లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ రోజు సింహాచలం స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు భక్తులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్రమంలో ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల కటుంబాలకు రూ.2 లక్షల రూపాయిలు , గాయపడిన వారికి 50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. మరో వైపు సింహాచలం ఘటన పై ఏపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు.