శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి వినూత్న చిత్రాలతో ఆకట్టుకున్నాడు దర్శకుడు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : స్మాల్ ఇండస్ట్రీ నుంచి బిగ్ ఇండస్ట్రీ కి షిప్ట్ అయ్యింది జగతి. సూపర్ సెక్సీలో లుక్ లో కిల్లర్ మూవీతో మన ముందుకు రావడానికి ప్లాన్ చేస్తున్నారు. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి వినూత్న చిత్రాలతో ఆకట్టుకున్నాడు దర్శకుడు పూర్వాజ్. ఆయన డైరక్షన్ లో వస్తున్న సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ . ఈ మూవీలో పూర్వాజ్ హీరోగా నటిస్తుండగా జ్యోతి పూర్వాజ్ హీరోయిన్ . విశాల్ రాజ్ , గౌతమ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే కిల్లర్.. పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ వర్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. థింక్ బ్యానర్ పై ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థలతో కలిసి పూర్వాజ్ , ప్రజయ్ కామత్ , ఎ పద్మనాభ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.