అశ్వవాహనం పై కల్కి అవతారంలో భక్తులకు స్వామివారు దర్శనమివ్వనున్నారు. రాత్రి అశ్వవాహనంతో వాహనసేవలు ముగియనున్నాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తిరుమలలో శ్రీవారి బ్రహోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారిమహారథోత్సవం వైభవంగా జరిగింది. భక్తుల జయజయధ్వానాల మధ్య శ్రీనివాసుడు రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది.. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుమాడవీధుల్లో విహరించారు. గోవింద నామస్మరణతో భక్తులు రథాన్ని లాగారు. రాత్రి అశ్వ వాహనసేవ నిర్వహిస్తారు. అశ్వవాహనం పై కల్కి అవతారంలో భక్తులకు స్వామివారు దర్శనమివ్వనున్నారు. రాత్రి అశ్వవాహనంతో వాహనసేవలు ముగియనున్నాయి.
రేపు చివరి ఘట్టమైన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. రేపు మలయప్పస్వామి, చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మాత్సవాలన్నింటిలోను ఈ సేవకే ఎక్కువ భక్తులు హాజరవుతారు కూడా. చక్రస్నానం చేసిన నీరు భక్తులు చల్లుకుంటే ఎలాంటి ఆరోగ్యసమస్యలు ఉండవని నమ్ముతారు. ఇప్పటికే చక్రస్నానం ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం శ్రీవారిని 60,775 మంది దర్శించుకున్నారు. చాలా మందికి తలనీలాలు సమర్పించారు. గురువారం ఒక్కరోజుకే హుండీకి 3.88 కోట్లు ఆదాయం సమకూరింది.