TIRUMALA: హనుమంత వాహానం పై తిరుమల శ్రీవారు !

నాలుగు మాడవీధులలో విహరిస్తూ  భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామి వారి వైభోగాన్ని చూడడానికి లక్షల్లో జనాలు ఎగబడుతున్నారు.


Published Oct 09, 2024 10:32:00 AM
postImages/2024-10-09/1728450227_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు ఆరో రోజు హనుమంత వాహానం పై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. పరిమళ భరిత పూలమాలలు, విశేష ఆభరణాలతో  అలంకృతులైన స్వామి వారు నాలుగు మాడవీధులలో విహరిస్తూ  భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామి వారి వైభోగాన్ని చూడడానికి లక్షల్లో జనాలు ఎగబడుతున్నారు.


హనుమంత వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, మంగళ వాయిద్యాల నడుమ, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా  వాహనసేవ కన్నుల పండుగగా జరుగతుంది. సాయంత్రం స్వర్ణరథం, రాత్రికి గజవాహనంపై భక్తులను శ్రీనివాసుడు అభయప్రదానం చేయనున్నారు. స్వామి వారి సేవల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని పనులు చక్కగా చేస్తున్నారు . 


లక్షల భక్త జనానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్న ప్రసాదాలు ..మంచినీరు , సెక్యూరిటీ ఏ విధమైన పొరపాట్లు జరగకుండా చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా  పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu venkateshwara-swamy ttd tirumala

Related Articles