స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : తిరుమల శ్రీవారి భక్తులకు ఈ విషయం శుభవార్తే. స్వామి వారి వైకుంఠద్వార దర్శనానికి డేట్లు ఫిక్స్ చేశారు. జనవరి నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనం అనౌన్స్ చేశారు . వివిధ రకాల ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించిన టీటీడీ పాలకమండలి నిర్ణయం . 2025లో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు దాదాపు పది రోజులపాటు స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.
ఈ వైకుంఠ ద్వార దర్శనం రోజు వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు మినహా చంటిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్‌ఆర్‌ఐల దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సాధారణ రోజుల్లో రూ.కోటి, శుక్రవారం అయితే రూ.కోటిన్నర విలువైన ఈ టికెట్‌ను పొందిన భక్తుడు తన సంబంధీకులు ఐదుగురితో కలిసి శ్రీవారి సేవలను రోజంతా ప్రత్యక్షంగా సమీపం నుంచే వీక్షించి పాల్గొనే భాగ్యం కలుగుతుంది.
ఉదయాస్తమాన సేవలో పాల్గొనే దాత తనతో వచ్చే ఐదుగురి పేర్లను ప్రతి సేవకు మార్చుకునేలా 2024 జనవరిలో తీర్మానించింది. కాబట్టి ఈ టికెట్ లో ఇప్పుడు ఏ సేవకైనా పేరు మార్చుకునే అవకాశం లేదు.