ఇటువంటి విపత్కర సమయంలో తనవంతు సహాయం చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ లకు తన వంతు సహాయంగా రూ. కోటి ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: భారీ వరదల కారణంగాతెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ లకు సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ఇస్తున్నారు. తాజగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు సృష్టించిన భీభత్సం చూస్తే తనకు చాలా బాధ కలిగిందని ఆయన వెల్లడించారు. ఇటువంటి విపత్కర సమయంలో తనవంతు సహాయం చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ లకు తన వంతు సహాయంగా రూ. కోటి ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
కాగా ఇప్పటికే జూ.ఎన్టీఆర్, మహేష్ బాబు ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో రూ. 50 లక్షల చొప్పున రూ.కోటి విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. విశ్వక్ సేన్ రూ. 5 లక్షల చొప్పున రూ. 10 లక్షలు, సిధ్ధూ జొన్నలగడ్డ రూ.15 లక్షల చొప్పున రూ. 30 లక్షలు, త్రివిక్రమ్ , రాధాకృష్ణ, నాగవంశీ రెండు రాష్ట్రాలకు రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు, దర్శకుడు వెంకీ అట్లూరి రూ. 5 లక్షల చొప్పున రూ.10 లక్షలు, నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షల చొప్పు రూ.కోటి విరాళం ప్రకటించారు.