HEALTH: బాడీలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి !

ఇది రక్తనాళాల్లో పేరుకుపోతుంది. దీని వల్ల శరీరానికి రక్తం, ఆక్సిజన్ అందకుండా అడ్డుపడి ఏ సమయంలోనైనా గుండెపోటు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది.


Published Dec 28, 2024 10:46:00 PM
postImages/2024-12-28/1735406261_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇప్పుడున్న అందరికి ఉన్న మెయిన్ సమస్య కొలస్ట్రాల్ ..మాకేం మేం సన్నగా ఉన్నాం...లావు గా ఉన్నవారికి చెప్పండి అంటారేమో... ఏం కాదు లావుగా ఉన్నవాళ్లకే కాదు సన్నగా ఉన్నవాళ్లకి కూడా కొలస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటే గుడ్‌ ఫ్యాట్‌ను పంపించేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ఒక మైనపులాంటి అంటుకునే పదార్థం. ఇది రక్తనాళాల్లో పేరుకుపోతుంది. దీని వల్ల శరీరానికి రక్తం, ఆక్సిజన్ అందకుండా అడ్డుపడి ఏ సమయంలోనైనా గుండెపోటు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది.


* వీటిలో బరువు పెరగడం, మద్యం సేవించడం, ధూమపానం, వ్యాయామం లేకపోవడం, కొవ్వు పదార్ధాలు తినడం వంటివి ముఖ్యంగా ఉన్నాయి.


*శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం అనేది సాధారణంగా తెలియదని వైద్యులు చెప్తున్నారు.


*చేతులు, కాళ్ళలో తిమ్మిరి , విపరీతమైన అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక రక్తపోటు, వికారం, శరీరంలో తిమ్మిరి వంటివి మెయిన్‌గా ఉంటాయి..


*11 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ పొందాలని నిపుణులు సూచిస్తున్నారు


* స్త్రీలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రక్త పరీక్ష చేయించుకోవాలట.. కొలెస్ట్రాల్‌ స్థాయిను మాత్రం ఎప్పటికప్పుడు డాక్టర్ కు మానిటర్ చెయ్యాల్సిందే. అలా అయితే గుండె ఆరోగ్యం చాలా బాగుంటుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu heart-attack fatyacids blood-clotting

Related Articles