ఈ ట్రయల్స్ లో సక్సస్ అయ్యారు. ఈ ఇంజక్షన్‌ను ఏడాదికి రెండు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: యావత్తు ప్రపంచం ఎప్పుడెప్పుడా అని వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్న ఎయిడ్స్ టీకా ఎట్టకేలకు వచ్చేసిందోచ్.. గిలీడ్ సైన్సెస్ ఈ టీకా రుపొందించిగా, దాని తాజాగా USFDA Lenacapavir ఇంజక్షన్‌కు అనుమతించింది. దాదాపు మూడు సంవత్సరాల్లో 20 లక్షల మందికి అందజేసింది. దక్షిణాఫ్రియా , టాంజానియాలో ఎక్కువ ఎయిడ్స్ కేసులు ఉన్న నేపథ్యంలో అక్కడ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్ లో సక్సస్ అయ్యారు. ఈ ఇంజక్షన్‌ను ఏడాదికి రెండు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది.
1980ల్లో HIV/AIDS ని వైద్య శాస్త్రవేత్తలు కన్నుగొన్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పుటి వరకు దానికి వ్యాక్సన్ లేకపోవడం HIV/AIDS పేషేంట్స్‌ను మనం చనిపోయేవారు. 88 మిలియన్ల మందికి పైగా HIV/AIDS సోకింది. 2023 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 39.9 మిలియన్ల మంది ఎయిడ్స్‌తో జీవిస్తున్నారు. యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART) HIVని స్థాయిని కొంచెం తగ్గించినా కానీ.. అది అందరికి పని చేయలేదు.
1987లో AZTకి FDA ఆమోదంతో తొలిసారిగా ప్రవేశపెట్టబడిన యాంటీరెట్రోవైరల్ థెరపీ, HIV చికిత్సలో ఒక మలుపు అని చెప్పవచ్చు. 50కి పైగా యాంటీరెట్రోవైరల్ మందులు ఇప్పుడు FDA అమోదించింది. అయితే ఇవి ఏవీ పూర్తిగా HIV ని నయం చేయలేకపోతున్నాయి. ప్రపంచ జనాభాలో 15 శాతం ఉన్న సబ్ -సహారా ఆఫ్రికా లో హెచ ఐవితో జీవిస్తున్న వారిలో దాదాపు 3 వంతుల మంది ఉన్నారు. ఇందులో దాదాపు 4 వేల మంది టీనేజ్ పిల్లలే ఉన్నారు.