సీఎం నితీష్ కుమార్ ఆఫీసును బాంబుతో పేల్చేస్తామని, ఏ పోలీసులు కూడా తమను అడ్డుకోలేరని మెయిల్ పంపించినట్లు తెలిపారు. తాము తీవ్రవాద సంస్థ అల్ ఖైదాకు చెందిన వాళ్లమని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్: సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆఫీసులో బాంబు ఉందంటూ ఆదివారం ఉదయం గుర్తు తెలియని దుండగులు బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. సీఎం నితీష్ కుమార్ ఆఫీసును బాంబుతో పేల్చేస్తామని, ఏ పోలీసులు కూడా తమను అడ్డుకోలేరని మెయిల్ పంపించినట్లు తెలిపారు. తాము తీవ్రవాద సంస్థ అల్ ఖైదాకు చెందిన వాళ్లమని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు.. సీఎం కార్యాలయం, పరిసరాల్లో గాలింపులు చేపట్టారు. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ప్రమాదం ఏమీ లేదని నిర్దారించుకొని వెళ్లారు. బాంబు బెదిరింపులపై సెక్రటేరియట్ పిఎస్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.