మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ నుండి కూడా ఇటీవల కొత్త కేసులు నమోదయ్యాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: దేశంలో మరోసారి కరోనా కంగారు మొదలైంది. కేసులు పెరుగుతున్నాయి. దేశంలో మహమ్మారి కాలం మొదలయ్యింది. ఈ పరిస్థితుల్లో మరో షాకింగ్ న్యూస్ బయటపడింది. దేశంలో కరోనా కొత్త వేరియంట్లు వెలుగు చూశాయి.
కొత్త వేరియంట్లు NB.1.8.1, LF.7లను భారత్ లో (తమిళనాడు, గుజరాత్) గుర్తించినట్లు ఇండియన్ సార్స్ కోవ్ -2 జీనోమిక్స్ కన్సార్షియం(INSACOG) డేటా వెల్లడించింది. ఈ వేరియంట్ల వ్యాప్తి ప్రస్తుతం సింగపూర్ లో ఎక్కువగా ఉంది. జ్వరం , ముక్కు కారడం , గొంతు , తలనొప్పి , నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. చాలా నెలల తర్వాత ఢిల్లీ కేరళ, తమిళనాడు , ఆంధ్రప్రదేశ్ , కర్ణాటకలోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ వేరియంట్ NB.1.8.1 కేసు ఒకటి. LF.7 రకం నాలుగు కేసులు కనుగొనబడినట్లు INSACOG డేటా తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ నుండి కూడా ఇటీవల కొత్త కేసులు నమోదయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీ లో కొత్త వేరియంట్ కేసులు 23 నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏపీ లో నాలుగు , తెలంగాణలో ఒకటి నిర్ధారించబడ్డాయి. బెంగుళూరు లో 9 నెలల చిన్నారికి పాజిటివ్ గా వచ్చింది. కేరళలో ఒక్క మే నెలలోనే 273 కేసులు నమోదయ్యాయి. అటు ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ అనేక జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నివారణ చర్యలను ముమ్మరం చేసింది. ఈ వేరియంట్ కూడా సెకండ్ వేవ్ వేరియంట్ లాగా ప్రమాదకరంగానే ఉంది. అయితే ప్రజారోగ్య పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ మరొక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్‌గా పరిగణించబడుతున్నప్పటికీ.. పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. మళ్లీ శానిటైజర్లు, మాస్క్ లు వాడండంటూ సజస్ట్ చేస్తుంది.
దాదాపు కేథార్ నాథ్ , తీర్ధయాత్రలకు వెళ్లినవారంతా ...జాగ్రత్త గాచెక్ చేసుకోవాలని . ఉత్తరాఖండ్ వెళ్లిన వారిలో చాలా మందికి కోవిడ్ పాజిటివ్ లక్షణాలు కనిపిస్తున్నాయని జాగ్రత్తలు వహించడం చాలా ముఖ్యమని తెలిపారు.