పెద్దోళ్లకు మోకాళ్లు, కీళ్లు నొప్పులు వస్తుంటాయి. అసలు ఈ కాల్షియం మన తప్పుల వల్లే తగ్గుతుందంటున్నారు డాక్టర్లు . అవేంటో చూద్దాం.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మనిషి బలంగా ఉండాలంటే ఎముకలు బాగుండాలి. అందులో కాల్షియం బాగుండాలి. కాల్షియం లేకపోతే చీమలు పట్టిన బెల్లంలా గుల్లబారిపోతాయి. వయసు పెరిగే కొద్ది కాల్షియం తగ్గుతుంది.అందుకే పెద్దోళ్లకు మోకాళ్లు, కీళ్లు నొప్పులు వస్తుంటాయి. అసలు ఈ కాల్షియం మన తప్పుల వల్లే తగ్గుతుందంటున్నారు డాక్టర్లు . అవేంటో చూద్దాం.
* రెడ్ మీట్ ..అంటే మటన్ తినే వారిలో శరీరానికి అవసరమైన దాని కంటే ఎక్కువ ప్రొటీన్స్ అందడం మొదలవుతుంది. దాని వల్ల ఎసిడిటీ వచ్చి మోషన్ లో కాల్షియం పోతుంది.
* శీతల పానీయాలు, సోడా వంటి కార్బోనేటేడ్ పానీయాలను ఎక్కువగా తీసుకునే వ్యక్తులు వీక్ బోన్ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
* కొందరు ఎసిడిటీ మందులు..డైజిషన్ టాబ్లెట్స్ తీసుకుంటారు . వీరి లో కూడా కాల్షియం లెవెల్స్ తగ్గిపోతాయి. ఈ మందులు కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలపై ప్రభావం చూపి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
*టీ , కాఫీ తాగేవారిలో కూడా కాల్షియం తక్కువగా ఉంటుంది. ఎముకలు గుల్లగా మారుతుంటాయి.
* కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉన్న పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, వాల్‌నట్ వంటి డ్రై ఫ్రూట్స్ మంచిది.
* శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ ...ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవారికి ఎముకల బలం తక్కువగా ఉంటుంది.
అయితే కాల్షియం లెవెల్స్ బాగుండాలంటే ...పాలు , పాల ఉత్పత్తులను తీసుకోవాలి. జున్ను తినడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. రా వెజ్ టెబుల్స్ తిన్నా కాల్షియం బాగుంటుంది. ముఖ్యంగా బీన్స్ ను ఆహారంలో చేర్చుకొండి . ఇందులో విటమిన్ ఎ, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. కాబట్టి కాల్షియం బాగుండాలంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటేనే హెల్దీగా ఉంటారని గుర్తుంచుకొండి.