రాగులలో పుష్కలంగా ఉండే కాల్షియం , ఐరన్ , పీచు పదార్ధాలు ఎముకలను బలంగా చేయడంతో పాటు షుగర్ , అధిక బరువును అదుపులో ఉంచడానికి చాలా హెల్ప్ అవుతాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఆరోగ్యానికి చిరుధాన్యాలు చాలా మంచివి. రాగులు చూడడానికి సన్నగా కనిపించినా బోలెడు పోషక విలువలను కలిగి ఉంటాయి. నేటి రోజుల్లో చాలా మంది ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా రాగులను డైలీ డైట్ లో భాగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాగులలో పుష్కలంగా ఉండే కాల్షియం , ఐరన్ , పీచు పదార్ధాలు ఎముకలను బలంగా చేయడంతో పాటు షుగర్ , అధిక బరువును అదుపులో ఉంచడానికి చాలా హెల్ప్ అవుతాయి.
ఈ క్రమంలోనే ఎక్కువ మంది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో రాగులతో జావ, ఇడ్లీ, దోశలు, అప్పుడప్పుడూ సంగటి వంటివి చేసుకొని తింటుంటారు.
రాగిపిండి - ఒక కప్పు
బొంబాయి రవ్వ - ఒక కప్పు
పెరుగు - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
వంటసోడా - చిటికెడు
నూనె - అరకప్పు
శనగపప్పు - అరచెంచా
మినప్పప్పు - అరచెంచా
ఆవాలు - అరచెంచా
జీలకర్ర - అరచెంచా
పచ్చిమిర్చి - రెండు
సన్నని ఉల్లిపాయ తరుగు - అర కప్పు
కొత్తిమీర తరుగు - కొద్దిగా
క్యారెట్లు - రెండు
ఈ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ కోసం ముందుగా ఉల్లిపాయలను అరకప్పు కి సన్నగా తరుముకొని పక్కకు ఉంచాలి. అలాగే క్యారట్స్ ని శుభ్రంగా కడిగి సన్నగా తురిమి పెట్టుకొండి. పచ్చిమిర్చి , కొత్తిమీర ను సన్నగా తరుక్కొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని బొంబాయి రవ్వ, పెరుగు, రుచికి కసరిపడా ఉప్పు, వాటర్ యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టి కాసేపు పక్కనుంచాలి. ఆలోపు స్టవ్ మీద కడాయిని పెట్టి చెంచా ఆయిల్ వేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. చక్కగా పొంగనాలు వేసుకొండి. రాగి పిండి కలుపుకుంటున్నపుడు చిన్న సోడాగుండా వేసుకొండి. పిండిని కొద్దిగా మూత పెట్టుకొండి. సన్నని సెగ మీద ఉడించుకొండి. టమోటా చట్నీతో తింటే సూపర్ ఉంటుంది.