విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే జాబ్ కాలెండర్ విడుదల చేయాలని, ఉద్యోగాల ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసెంబ్లీని ముట్టడించేందుకు PDSU-PYL సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో అక్కడికి నాయకులు PDSU సభ్యులు అక్కడికీ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై PDSU-PYL సంఘాలు తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి నిధులు కేటాయించనందుకు ప్రభుత్వంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహిస్తున్నాయి. బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు.
విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే జాబ్ కాలెండర్ విడుదల చేయాలని, ఉద్యోగాల ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అంటున్నారు.
తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని లేదంటే, నిరసనలను మరింత ఉదృతం చేస్తామని PDSU-PYL సంఘాల నాయకులు హెచ్చరించారు. తమ డిమాండ్ల కోసం అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు PDSU-PYL నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అసెంబ్లీ వద్ద తీర్వ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని వ్యాన్‌లో ఠాణాకు తరలించినట్లు తెలుస్తోంది.