ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ.. సరిగ్గా అప్పుడే తెలుగులో స్ట్రైట్ సినిమాలు ఉండడంతో.. కేవలం తమిళంలో మాత్రమే రిలీజ్ చేసి.. తెలుగు వెర్షన్ ను డైరెక్ట్ గా ఓటీటీ లోకి తీసుకుని వస్తున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రఘుతాత అనగానే కంప్లీట్ కామెడీ మూవీ అనుకుంటారంతా..కానీ కాదు ..మాంచి క్రైమ్ కామెడీ సినిమా. మెయిన్ లీడ్ కీర్తి సురేష్. కీర్తి అనగానే సినిమా పై మంచి హైప్ వచ్చింది. థియేటర్ లో ఆగష్టు 15 రిలీజ్ అయియింది.అదే సమయంలో ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ.. సరిగ్గా అప్పుడే తెలుగులో స్ట్రైట్ సినిమాలు ఉండడంతో.. కేవలం తమిళంలో మాత్రమే రిలీజ్ చేసి.. తెలుగు వెర్షన్ ను డైరెక్ట్ గా ఓటీటీ లోకి తీసుకుని వస్తున్నారు. తెలుగు లో అయితే పెట్టుబడి ఎక్కువ పెట్టాలి. ఓటీటీలో అయితే అంత అవసరం లేదు. ప్రొడ్యూసర్ తెలైన వాడు.
ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 13 నుంచి తమిళం , తెలుగుతో పాటు.. కన్నడలో కూడా స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అయితే తమిళ్ లో కీర్తి ఫేమ్ అంతగా వర్కవుట్ కాలేదు . కాని కీర్తి యాక్టింగ్ కి మాత్రం 100 కి 100 మార్కులు గుద్దిపడేశారు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా కథ అంతా కూడా… 1960 బ్యాక్డ్రాప్ లో హిందీ వ్యతిరేక ఉద్యమం అనే రాజకీయ అంశం చుట్టూ కొనసాగుతూ ఉంటుంది. పైగా ఈ సినిమాలో రాజకీయంతో పాటు లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పాటు.. ఎంఎస్ భాస్కర, దేవదర్శిని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాజీవ్ రవీంద్రనాథన్ ప్రధాన పాత్రలలో నటించారు. కీర్తిసురేష్ లో కనిపించని మంచి కామెడీ టైమింగ్ ఉంది. అది సినిమాకు బాగా వర్కవుట్ అయ్యింది. మీ టైం వేస్ట్ కాదు...శుభ్రంగా చూసేయొచ్చు.