న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏం తినాలన్నా ఇదే బాధ. బరువు ...100 గ్రాముల స్నాక్స్ తింటే 500గ్రాముల బరువు పెరుగుతాం. అందులో గాలి కూడా తింటామో ఏమో తెలీదు కాని బరువు మాత్రం మంత్రం వేసినట్టు పెరుగుతుంది. కాని కొన్ని స్నాక్స్ తింటే బరువు పెరగదు..తగ్గుతుంది అసలు అదేంటో చూద్దాం.
ఫూల్ మఖానా తినడం వల్ల పలు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఇంత ఆరోగ్యకరమైన మఖానాతో పిల్లలు ఇష్టపడి తింటారు. వీటితో కూరలు, స్నాక్స్, స్టాటర్స్ ఇలా చాలానే తయారు చేసుకోవచ్చు. అంతే కాదు పిల్లలు ఎముకలు గట్టి పడడానికి కూడా ఇవి తినిపిస్తారు. వీటితో చేసిన రెసిపీలు చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇందులో పోషకాలు అన్నీ ఇన్నీ కావు. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. ఫూల్ మఖానా తినడం వల్ల పలు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
ఫూల్ మఖానా చిడ్వాకి కావాల్సిన పదార్థాలు:
నిజానికి ప్రత్యేకమైన ఐటమ్స్ ఏం కాదు. మనం మన మిక్సర్ కి ఏం వాడతామో అవే వేస్తే సరిపోతుంది.
*కడాయిలో కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో కొద్దిగా మఖానా వేసి చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి.
*వీటిని దోరగా వేయించికున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి.
* ఆ తర్వాత ఇందులో వేరు శనగ , వేపిన శెనగపప్పు అసలు పప్పులు ఎక్కువ వేస్తే ఇష్టపడేవారికి మరిన్ని పప్పు, జీడి పప్పు , బాదం ఇలా ఎన్నైనా వేసుకోవచ్చు.
*ఒకదాని తర్వాత మరొకటి వేసి రంగు మారేంత వరకూ ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. తర్వాత మఖానా ను వేసుకొండి. అంతే .