ఈ సంవత్సరం చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 12న వచ్చింది. పంచాంగం ప్రకారం చైత్ర పూర్ణిమ తిథి ఏప్రిల్ 12న తెల్లవారుజామున 3:20 గంటలకు ప్రారంభమవుతుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : హిందూ ధర్మంలో హనుమాన్ జయంతి ప్రత్యేకతమైనది. హనుమాన్ చిరంజీవి ...ఇప్పటికే బ్రతికే ఉన్నారని భక్తులను ఓ కంట కనిపెడతారని అంటుంటారు. విజయ ప్రదాత, రక్షణ ఇచ్చే దైవంగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. అయితే హనుమాన్ జయంతి ని ఏడాదిలో రెండు సార్లు జరుపుకుంటారు. చాలా మందికి ఈ విషయం తెలీదు. కారణం ఏంటంటే...
ఈ సంవత్సరం చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 12న వచ్చింది. పంచాంగం ప్రకారం చైత్ర పూర్ణిమ తిథి ఏప్రిల్ 12న తెల్లవారుజామున 3:20 గంటలకు ప్రారంభమవుతుంది. అదే టైంలో ఏప్రిల్ 13 న ఉదయం 5.52 గంటలకు ముగుస్తుంది. కనుక ఏప్రిల్ 12న హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుంటారు.
హనుమాన్ జయంతిని ఒకటి చైత్రపౌర్ణమి రోజు చేస్తారు.రెండవది కార్తీక కృష్ణ చతుర్ధశి ఎందుకంటే హనుమాన్ జన్మకు సంబంధించింది మరొకటి అతను స్పృహ కొల్పోయిన తర్వాత తిరిగి జీవించడానికి సంబంధించింది. అయితే వాల్మీకి రాసిన రామాయణం ప్రకారం కార్తీకమాసంలో కృష్ణపక్షం చతుర్ధశి రోజున జన్మించాడు. ఈ రోజును హనుమంతుని అవతార ఉత్సవంగా జరుపుకుంటారు. అదే టైంలో చైత్ర మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున హనుమంతుడి విజయ అభినందన మహోత్సవంగా జరుపుకుంటారు.
* చైత్రపౌర్ణమి రోజు హనుమాన్ రెండో జన్మ ఎత్తారు. అందుకే ఆ రోజు జయంతి చేసుకుంటారు.
* హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక కృష్ణ చతుర్దశి నాడు, తల్లి సీత హనుమంతుడికి అమరత్వం అనే వరం ఇచ్చింది. అందుకే ఈ రోజున హనుమాన్ జయంతిని కూడా జరుపుకుంటారు.