Baldness: బట్టతల వస్తుందా.. అయితే ఈ ఫుడ్ తప్పనిసరి.!

ప్రస్తుత కాలంలో చాలామంది బాయ్స్ కి చిన్న వయసులోనే బట్టతల వచ్చి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక పెళ్లి కాని యువత అయితే ఆ తిప్పలు చెప్పలేము. పెళ్లి అవ్వకముందే బట్టతల రావడంతో చాలామంది పెళ్లిళ్లు


Published Sep 09, 2024 08:40:00 AM
postImages/2024-09-09/1725850520_baldness.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది బాయ్స్ కి చిన్న వయసులోనే బట్టతల వచ్చి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక పెళ్లి కాని యువత అయితే ఆ తిప్పలు చెప్పలేము. పెళ్లి అవ్వకముందే బట్టతల రావడంతో చాలామంది పెళ్లిళ్లు రిజెక్ట్ అవుతున్నాయి. మరి ఆ విధంగా బట్టతల రావడానికి కారణాలేంటి. మనం కంట్రోల్ చేసే పద్ధతులు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే బట్టతల అనేది కొంతమందికి వంశపారంపర్యంగా వస్తే మరి కొంతమందికి  ఫుడ్ ఎఫెక్ట్ వల్ల వస్తుందట. లేనిపోని ఆహారాలు తిని   వెంట్రుకలను పోగొట్టుకునే వారు ఎందరో ఉన్నారట. కాబట్టి మన వెంట్రుకలను కాపాడుకోవాలి అంటే తప్పనిసరిగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తినాలని  నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

 గ్రీన్ టీ:
 ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండటం వల్ల  మీ హెయిర్ కు ప్రోటీన్ అందుతుందట. దీనివల్ల వెంట్రుకలు బలంగా తయారై ఊడిపోకుండా ఉంటాయట.

 కోడిగుడ్లు:
 మనం తినే కోడిగుడ్లలో  ఒమేగా త్రీ మరియు ఫ్యాటి యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మీ వెంట్రుకల కుదుళ్ల నుంచి బలంగా మార్చేందుకు ఉపయోగపడతాయట. అంతేకాకుండా కోడిగుడ్డులో ఉండే వైట్  జుట్టుకు పెట్టుకోవడం వల్ల మరింత బలంగా తయారవుతుందని అంటున్నారు. 

 బాదం:
 బాదంలో విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల  జుట్టుకు బలం వస్తుందట. కాబట్టి బాదమును ప్రతిరోజు తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్ల నుంచి బలంగా తయారవుతుందని  నిపుణులు అంటున్నారు. 

 వాల్ నట్స్ :
 ఈ నట్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటి యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఈ పుష్కలంగా ఉండడం వల్ల వెంట్రుకలకు అద్భుతమైనటువంటి బలం చేకూరుతుంది. 

 పుట్టగొడుగులు:
 వీటిని ప్రతి రోజు తినడం వల్ల  ఇందులో ఉండే పోషకాలు మీ జుట్టును బలంగా ఉంచి బట్టతల రాకుండా చేస్తాయట. 

 సోయాబీన్:
 సోయాబీన్స్ లో ఉండేటువంటి ప్రోటీన్లు, విటమిన్లు మీ జుట్టు రాలిపోవడాన్ని ఆపేస్తాయి. కుదుళ్ల నుంచి బలంగా తయారయ్యేలా చేస్తాయట. 

 చేపలు:
 చేపలు ఎక్కువగా తినడం వల్ల వీటిలో ఉండే ఒమేగా త్రీ ప్యాటీ యాసిడ్స్ మీ యొక్క వెంట్రుకలకు రావలసినటువంటి పోషణను ఎక్కువగా అందించి  వెంట్రుకలను బలంగా తయారయ్యేలా చేస్తాయట..

 పాలకూర:
 ఈ పాలకూరల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల, ఇందులో ఉండే ఆంటీ యాక్సిడెంట్లు మీయొక్క వెంట్రుకలను బలంగా తయారయ్యేలా మారుస్తాయట.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu fish baldness green-tea wall-nults eggs mashrooms

Related Articles