మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తుందని తెలిపారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పుష్ప-2 ప్రీమియర్ షో లో సంధ్య థియేటర్ లో జరిగిన ఇన్సిడెం్ పై అల్లు అర్జున్ టీం రెస్పాండ్ అయ్యారు. రేవతి అనే మహిళ తన ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే . ఆమె కుమారుడు శ్రీతేజ్ అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. "నిన్న రాత్రి సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తుందని తెలిపారు.
బుధవారం రాత్రి 9.30 గంటలకు ఈ సినిమాను వీక్షించడానికి హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వచ్చారు. అల్లుఅర్జున్ ను చూడడానికి జనాలు ఎబడడం తో రేవతి తన కొడుకు తొక్కిసలాటలో పడిపోయారు.
ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సీపీఆర్ చేశారు. ఆ తర్వాత ఆర్‌టీసీ క్రాస్ రోడ్డులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీతేజ్ ను పోలీసులు నిమ్స్‌కు తరలించారు. తన కుమారుడు మాత్రం ఇంకా హాస్పటిల్ లో చికిత్స పొందుతున్నాడు.