health : ఎంత ఫిట్ గా ఉన్నా..ప్లేయర్స్ లోను ఎందుకు ఈ హార్ట్ అటాక్స్

బ్యాడ్మింటన్ ఆడుతూ ఓ ప్లేయర్ కోర్టులోనే గుండెపోటుకు గురై కుప్పకూలి మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో చోటుచేసుకుంది. చైనాకు చెందిన 17 ఏళ్ల ఝాంగ్ ఝజీ.. కోర్టులోనే కుప్పకూలిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published Jul 02, 2024 04:12:00 PM
postImages/2024-07-02/1719916963_52066185x104.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వ్యక్తులు అనారోగ్యం అంటేనే ..ఏంటోయ్ వయసైపోతుందా ఏంటి...ఆరోగ్యం బాలేదంటున్నావ్..అనే వారట.ఇప్పుడు ఆరోగ్యసమస్యలు అందరికి కామనే. పుట్టినప్పటి నుంచి ...ఏదో రకంగా డాక్టర్లకు హాయ్ , హాలో చెప్పడమే పని.  పోనీ మనం అంటే  ఫిజికల్ ఫిట్ నెస్ ...సరైన డైట్ తో పర్ఫెక్ట్ గా ఉండే ప్లేయర్స్ ( players)  కూడా సడన్ గా హార్ట్ అటాక్ ( heart attack) తో చనిపోతున్నారు.

బ్యాడ్మింటన్ ఆడుతూ ఓ ప్లేయర్ కోర్టులోనే గుండెపోటుకు గురై కుప్పకూలి మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో చోటుచేసుకుంది. చైనాకు చెందిన 17 ఏళ్ల ఝాంగ్ ఝజీ.. కోర్టులోనే కుప్పకూలిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జపాన్ ( japan)  ఆటగాడు కజుమా కవానోతో ఝాంగ్ ఝజీ తలపడుతున్నాడు. తొలి గేమ్ మొదలై కొద్దిసేపటికే అతడు కోర్టులో( court) కుప్పకూలిపోయాడు. ఏమైందోనని అతడి కోచ్.. కోర్టులోకి వచ్చి చూసిన తర్వాత ఫిజియో వచ్చి అతడికి ప్రాథమిక చికిత్స చేశారు. కోర్టులో ప్లేయర్ అలా పడిపోయినా సాటి ఆటగాడు ...ఏ మాత్రం రియాక్ట్ కాకపోవడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. అతడ్ని కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ‘ఝాంగ్ ఝాజీ హఠాత్తుగా గుండెపోటుకు గురయి చనిపోయాడు’ అని ఇండోనేషియా బ్యాండింటన్ అసోసియేషన్ ప్రకటించింది. ఫిట్ గా ఉండే ప్లేయర్స్ కూడా గుండెపోటు ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు నెటిజన్లు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu heart-attack players fitness

Related Articles