ఈ సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్డుకు అడ్డంగా పెద్ద పెద్ద రాళ్లు ఉండటంతో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కిలో మీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి.
న్యూస్ లైన్, హైదరాబాద్: భారీ వర్షాలతో శ్రీశైలం ఘాట్ రోడ్డు డేంజర్ గా మారింది. గుట్టల మీద నుంచి వరదలు భారీగా వస్తుండటంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఆదివారం శ్రీశైలం ఘాట్ రోడ్డులోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్డుకు అడ్డంగా పెద్ద పెద్ద రాళ్లు ఉండటంతో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కిలో మీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి.
భారీ వర్షాల నేపథ్యంలో వచ్చే భక్తులు సైతం జాగ్రత్తగా రావాలని అధికారులు చూసిస్తున్నారు. కొండల పక్కన ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఆపొద్దని సూచిస్తున్నారు. నిదానంగా జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచిస్తున్నారు. వీలైనంత వరకు వర్షాల సమయంలో ప్రయాణాలు కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు.