CHINA: చంద్రయానంలో చైనా ప్రపంచ రికార్డు 2024-06-25 20:18:49

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  చంద్రయానంలో చైనా( CHINA)  ప్రపంచ రికార్డు సృష్టించింది. చాంగే -6 చంద్రుని ఆవల ఉపరితలంపై నుండి రాళ్లు, మట్టి ( SAND) నమూనాలను తీసుకుని భూమిపైకి వచ్చింది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో దిగినట్లు అధికారులు తెలిపారు.మే లో నింగికి ఎగిరిన చాంగే -6   దాదాపు 53 రోజుల పాటు ప్రయాణించి నేడు భూమికి చేరుకుంది.


25 లక్షల ఏళ్ల నాటి అగ్ని పర్వత శిలలు, ఇతర పదార్థాలు ఈ నమూనాల్లో ఉండవచ్చని చైనా ( CHINA)శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. దీంతో చంద్రుని రెండు వైపుల ఉన్న భౌగోళిక వైవిధ్యాలకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని భావిస్తున్నారు. అయితే చైనా ఈ మధ్య కాలంలో చంద్రుని( MOON)  పై అన్ని సక్సస్ ఫుల్ మిషన్స్ ను రన్ చేసింది.


చంద్రుని( MOON)  రెండు వైపుల గల వైవిధ్యానికి ఏ భౌగోళిక కార్యాచరణ బాధ్యత వహిస్తుందన్న లూనార్‌ రీసెర్చ్‌లోని ప్రధాన ప్రశ్నకు ఈ నమూనాలు సమాధానమిచ్చే అవకాశం ఉందని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో జియాలజిస్ట్‌ జోంగ్యు యుయె తెలిపారు. చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ భాగస్వామ్యంతో సోమవారం ప్రచురించిన అధ్యయనంలో పేర్కొన్నారు. ఇప్పుడు వీటి పరిశోధనల ఆధారంగా చంద్రునిపై వాతావరణ అంచనాలు మొదలవుతాయి.