Revanth America tour : కొత్త కాగ్నిజెంట్ సెంటర్.. సీఎం రేవంత్ తో కంపెనీ చర్చలు

ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తెలంగాణలో కొత్త సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సీఎం రేవంత్ అధికార బృందం ప్రకటించింది.


Published Aug 05, 2024 08:43:38 PM
postImages/2024-08-05/1722870818_cmrevanthcognigent.jpg

న్యూస్ లైన్ డెస్క్ : ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తెలంగాణలో కొత్త సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సీఎం రేవంత్ అధికార బృందం ప్రకటించింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా కొత్త సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.

 

గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కారణంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు ప్రపంచ స్థాయి కంపెనీలు తరలి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా కాగ్నిజెంట్ సైతం హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరణకు సిద్ధమైంది. టెక్నాలజీ, ఆవిష్కరణలకు కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరించడం పట్ల కాగ్నిజెంట్ సీఈవో ఎస్.రవికుమార్ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో నెలకొల్పే కొత్త సెంటర్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కొత్త సెంటర్ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news telanganam cm-revanth-reddy latest-news news-updates telugu-news

Related Articles