America: డోనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు

పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఏర్పాటు చేసియాన్ సభలో మాట్లాడుతుండగా ఆయనపై దాడి జరిగింది. కుడివైపు తిరిగి మాట్లాడుతుండగా ఆయన చెవిని తాకుతూ బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ కాల్పుల్లో ట్రంప్‌ చెవికి గాయమైంది. కాల్పులు జరుపుతున్నట్లు గ్రహించిన ట్రంప్ వెంటనే కింద కూర్చుండిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది  ట్రంప్‌ని చుట్టుముట్టారు. కొద్దిసేపటికి లేచి నిలబడ్డ ఆయనను సిబ్బంది అక్కడి నుండి తరలించారు. 


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-14/1720941680_modi95.jpg

న్యూస్ లైన్ డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఏర్పాటు చేసియాన్ సభలో మాట్లాడుతుండగా ఆయనపై దాడి జరిగింది. కుడివైపు తిరిగి మాట్లాడుతుండగా ఆయన చెవిని తాకుతూ బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ కాల్పుల్లో ట్రంప్‌ చెవికి గాయమైంది. కాల్పులు జరుపుతున్నట్లు గ్రహించిన ట్రంప్ వెంటనే కింద కూర్చుండిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది  ట్రంప్‌ని చుట్టుముట్టారు. కొద్దిసేపటికి లేచి నిలబడ్డ ఆయనను సిబ్బంది అక్కడి నుండి తరలించారు. 

వెంటనే ప్రైవేటు విమానంలో అక్కడి నుంచి ట్రంప్‌ను గోల్ఫ్‌క్లబ్‌‌కు తీసుకొని వెళ్లారు. ట్రంప్ సభలో జరిగి కాల్పుల్లో రిపబ్లికన్‌ నేత సమీప బంధువుకు కూడా గాయాలయినట్లు తెలుస్తోంది. టెక్సస్‌ రిప్రజెంటేటీవ్‌ రోనీ జాక్సన్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ట్రంప్‌ సభకు హాజరయ్యారు. గన్‌మెన్‌ కాల్పుల్లో ఆయన అల్లుడి మెడకు తూటా తగలడంతో తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలినట్లు తెలుస్తోంది. అతన్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్రంప్‌పై కాల్పులు.. బైడెన్ అలర్ట్ 
ఇక పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ట్రంప్‌పై కాల్పులు జరిగిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అప్రమత్తమయ్యారు. వీకెండ్ హాలిడేస్‌ను రద్దు చేసుకొని వైట్ హౌస్‌కు వెళ్లేందుకు బైడెన్ సిద్దమైనట్లు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థల నుంచి బైడెన్‌ స్వయంగా బ్రీఫింగ్స్‌ తెలుసుకోనున్నారు.  ఆయన వెంట ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ కూడా ఉండే అవకాశం  ఉన్నట్లు సమాచారం.

కాగా, ట్రంప్‌పై కాల్పులు జరిపిన అనుమానితుడిని థామస్‌ మాథ్యూ క్రూక్స్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ట్రంప్‌పై కాల్పులు జరిపిన వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు నిందితుడిపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. ట్రంప్‌పై థామస్‌ మాథ్యూనే కాల్పులు జరిపినట్లు ఎఫ్‌బీఐ నిర్దారించడంతో ఇప్పటికే పలు మీడియా సంస్థల్లో అతడి పేరు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu telanganam firingontrump donaldtrump trump2024 donaldjtrump trumprally

Related Articles