ఢిల్లీలోని మోహన్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని అమెజాన్ సెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గోడౌన్‌లో ఈ నెల 19న 15 గంటలపాటు కొనసాగిన ఈ తనిఖీల్లో నాణ్యత లేని వేలాది ఉత్పత్తులను అధికారులు సీజ్ చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఈ రోజుల్లో షాపింగ్ అంటే ఫ్లిప్ కార్ట్ , అమేజాన్ , ఇలా ఆన్ లైన్ షాపింగే...దాదాపు 90 % షాపింగ్ అంతా ఆన్ లైన్ మార్కెట్టే. అయితే చాలా బ్రాండ్లకు చెందిన వస్తువులు ఆన్ లైన్ ఛీప్ అని తీసుకుంటూ ఉంటాం.అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జరిపిన దాడుల్లో చాలా బ్రాండ్లను నకిలీ వస్తువులు మార్కెటింగ్ చేస్తున్నట్లు తెలిపింది.
ఢిల్లీలోని మోహన్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని అమెజాన్ సెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గోడౌన్‌లో ఈ నెల 19న 15 గంటలపాటు కొనసాగిన ఈ తనిఖీల్లో నాణ్యత లేని వేలాది ఉత్పత్తులను అధికారులు సీజ్ చేశారు. ఈ నకిలీ వస్తువుల్లో దాదాపుగా గీజర్లు, మిక్సీలు , చాలా ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయి. వీటికి ఐఎస్ ఐ గుర్తింపు లేదని నకిలీ లేబుల్స్ ఉన్నాయని అధికారులు తాజాగా వెల్లడించారు.
ఢిల్లీలోని త్రినగర్‌లో ఉన్న ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఇన్‌స్టాకార్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ గోడౌన్‌లో నిర్వహించిన తనిఖీల్లోనూ నాసిరకం ఉత్పత్తులను గుర్తించారు. డిస్పాచ్ కు రెడీ గా ఉన్న స్పోర్స్ వేర్, ఫుట్ వేర్ లను సీజ్ చేశారు. వాటిపై తయారుతేదీ కాని , ఐఎస్ ఐ ముద్ర కాని లేదని అధికారులు తెలిపారు. రూ. 6 లక్షల విలువైన 590 జతల స్పోర్ట్స్ షూస్‌ను సీజ్ చేశారు. కాగా, గతవారం తమిళనాడులో 3 వేల ఉత్పత్తులను బీఐఎస్ సీజ్ చేసింది.