ప్రజాపాలన కాదిది ప్రశ్నించే గొంతుకలను నొక్కివేస్తున్న పాలన అని వ్యాఖ్యానించారు. రుణమాఫీపై వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్తే ఈ ప్రభుత్వానికి భయం ఎందుకు? అని ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: మహిళా జర్నలిస్టులపై దాడి ఘటనపై మాజీ మంత్రి, BRS నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. దీన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మహిళా జర్నలిస్టులు సరిత, విజయరెడ్డిలపై కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేయడం హేయమైన ఘటన అని ఆయన అన్నారు.
కొండారెడ్డిపల్లి నిషేధిత ప్రాంతమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని విమర్శించారు. ప్రజాపాలన కాదిది ప్రశ్నించే గొంతుకలను నొక్కివేస్తున్న పాలన అని వ్యాఖ్యానించారు. రుణమాఫీపై వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్తే ఈ ప్రభుత్వానికి భయం ఎందుకు? అని ప్రశ్నించారు.
మహిళా జర్నలిస్టులను చుట్టు ముట్టి, ఫోన్లు లాక్కుని, కెమెరాలు లాక్కుని, కెమెరాలలో చిప్స్ లాక్కుని దాడి చేసి బెదిరించడం దారుణమని నిరంజన్ రెడ్డి అన్నారు. దాడికి పాల్పడిన వారిని భేషరతుగా అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం, రేవంత్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు.