Olympics: ఫోగట్‌కు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా

భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.


Published Aug 08, 2024 06:30:42 PM
postImages/2024-08-08/1723122042_haryana.PNG

న్యూస్ లైన్ డెస్క్: భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. గురువారం వినేశ్‌కు 4 కోట్ల రూపాయల నజరానా ప్రకటనట్లు ప్రభుత్వం వెల్లడించింది. వినేష్‌ను ఛాంపియన్‌గా పరిగణిస్తూ నజరానా ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగట్ అద్భుతంగా రాణించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ఫైన‌ల్లో గోల్డ్ మెడ‌ల్‌తో దేశాన్ని గ‌ర్వించేలా చేయాల‌నుకున్న వినేశ్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. 50 కిలోల కంటే అద‌నంగా 100 గ్రాములు ఉంద‌ని నిర్వాహ‌కులు ఆమెపై అన‌ర్ష‌త వేటు వేశారు. అయితే ఈ విషయంపై ఫొగాట్ పారిస్ స్పోర్ట్స్ కోర్టును ఆశ్రయించగా.. పారిస్ స్పోర్ట్స్ కోర్టు వినేశ్‌కు సిల్వర్ మెడల్ ఇవ్వలని కోర్టు తీర్పు ఇచ్చింది.  

newsline-whatsapp-channel
Tags : government parisolympics paris2024 vinesh-phogat

Related Articles