బెంగాల్ కు చెదిన షబానా పర్వీన్ తో అతనికి పరిచయం ఏర్పడి ..ఆ పరిచయం ప్రేమగా మారి గతేడాది కోల్ కత్తాలో ఇద్దరు పెళ్లి చేసుకుంటారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : గర్భవతైన భార్యపై భర్త దాడి చేసిన దారుణ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నడిరోడ్డుపై సిమెంట్ ఇటుకతో దాడి చేయడంతో తీవ్రగాయాలపాలైన ఆమె ప్రస్తుతం ప్రాణాపాయస్థితిలో ఆసుత్రిలో చికిత్స పొందుతుంది. హఫీజ్ పేట ఆదిత్యనగర్ లో ఉండే మహ్మద్ బస్ రత్ 2023 లో అజ్ మేర్ దర్గాకు వెళ్లాడు. బస్సు ప్రయాణంలో బెంగాల్ కు చెదిన షబానా పర్వీన్ తో అతనికి పరిచయం ఏర్పడి ..ఆ పరిచయం ప్రేమగా మారి గతేడాది కోల్ కత్తాలో ఇద్దరు పెళ్లి చేసుకుంటారు.
అనంతరం బస్‌రత్ భార్యను హఫీజ్‌పేటకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో కుటుంబ విభేదాల కారణంగా భార్య ఒత్తిడితో వేరే కాపురం పెట్టారు.రీసెంట్ గా పర్వీన్ గర్భం దాల్చింది, దీంతో ఎక్కువ వాంతులతో రీసెంట్ గా హాస్పటిల్ లో అడ్మిట్ చేశాడు. ఆరోగ్యం కొంత మెరుగుపడడంతో ఏప్రిల్ 1న రాత్రి 10 గంటల టైంలో డిశార్చి అయ్యింది.అయితే ఇంటికి తిరిగొచ్చే క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో భార్యను బస్ రత్ కొట్టడంతో కింద పడింది.
అదే అదునుగా భావించిన బస్‌రత్.. పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకలు తీసుకొని ఆమె తలపై పలుమార్లు విచక్షణరహితంగా దాడి చేయడంతో స్పృహ తప్పింది. బస్ రత్ అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉందన్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.