Uk Elections Results:రిషి సునాక్ దారుణంగా ఓటమి.!

బ్రిటన్ లో 2024 సంబంధించి ఎన్నికల ముగిశాయి. ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి.  ఇందులో రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీ నుంచి పోటీ చేయగా, సర్ కైరు స్టార్మర్  లేబర్ పార్టీ నుంచి బరిలోకి దిగారు. ఈ విధంగా ఇద్దరి మధ్య జరిగినటువంటి హోరాహోరీ పోటీలో  లేబర్ పార్టీ అధినాయకుడు సర్ ఖైర్ స్టార్మర్ అద్భుతమైన మెజారిటీతో గెలుపొందినట్టు తెలుస్తోంది. మరి ఆయనకు ఎంత మెజారిటీ వచ్చింది అనే వివరాలు చూద్దాం..


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-05/1720159260_rishisunak1.jpg

న్యూస్ లైన్ డెస్క్: బ్రిటన్ లో 2024 సంబంధించి ఎన్నికల ముగిశాయి. ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి.  ఇందులో రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీ నుంచి పోటీ చేయగా, సర్ కైరు స్టార్మర్  లేబర్ పార్టీ నుంచి బరిలోకి దిగారు. ఈ విధంగా ఇద్దరి మధ్య జరిగినటువంటి హోరాహోరీ పోటీలో  లేబర్ పార్టీ అధినాయకుడు సర్ ఖైర్ స్టార్మర్ అద్భుతమైన మెజారిటీతో గెలుపొందినట్టు తెలుస్తోంది. మరి ఆయనకు ఎంత మెజారిటీ వచ్చింది అనే వివరాలు చూద్దాం..

మొత్తం బ్రిటన్ లో 650 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇందులో రెండు పార్టీల నుంచి ప్రధాన అభ్యర్థులు పోటీ చేశారు.  ఈ పోటీలో లేబర్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు 410 స్థానాల్లో విజయం సాధించినట్టు తెలుస్తోంది. దీంతో బ్రిటన్ ప్రధానిగా స్టార్మార్    త్వరలో ప్రమాణస్వీకారం కూడా చేయబోతున్నారు. ఇదే తరుణంలో  కన్జర్వేటివ్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు  దాదాపు 240 సీట్లకు మాత్రమే పరిమితమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని రిషి సునాత్ మాట్లాడుతూ ప్రజల తీర్పును ఎవరు మార్చలేరు,

 అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఎన్నికలు శాంతియుతంగా జరిగాయని  హ్యాపీగానే అధికారం కూడా చేంజ్ అవుతుందని తెలియజేశారు. అంతేకాకుండా కొత్త ప్రధానిగా  ఎన్నికైనటువంటి సర్ స్టార్ మార్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కన్జర్వేటివ్ పార్టీ కోసం  చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు.  ఇదే తరుణంలో లేబర్ పార్టీ నుంచి స్టార్మర్ బోర్న్ అండ్ సెయింట్  పాన్ క్రాస్ అనే స్థానం నుంచి బరిలోకి దిగి 18884 ఓట్ల మెజారిటీతో  గెలుపు సాధించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలిచిన నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి అద్భుతమైన సేవలు అందించడమే కాకుండా దేశవ్యాప్తంగా అద్భుతమైన పాలన చేస్తానని తెలియజేశారు. ఇదే తరుణంలో స్టార్మర్ కు బ్రిటన్ ప్రజలంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గత 14 సంవత్సరాలుగా కన్జర్వేటివ్ పార్టీ తన మానియా కొనసాగిస్తూ వచ్చింది. ఈసారి భంగ పాటు తప్పలేదు.  దీనికి ప్రధాన కారణం తరచూ ఈ పార్టీలో ప్రధానులు మారడం, పరిపాలనలో ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల  ప్రజలు ఈ పార్టీని దూరం పెట్టి లేబర్ పార్టీకి పట్టం కట్టారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu rishisunak starmar uk-elections labour-party

Related Articles