పాపం యావత్త్ ప్రపంచం అంతా మూగజీవాల మీద ప్రేమలు చూపిస్తుంటే ...రొమేనియా ప్రభుత్వం మూగ జీవులను చంపేయాలని ప్లాన్ చేసింది. ఒకటి కాదు రెండు కాదు 481 ఎలుగుబంట్లను దాదాపు 500 ఎలుగుబంట్లను చంపాలని ప్లాన్ చేస్తున్నారు. దేశంలో దాదాపు 8 వేల ఎలుగుబంట్లు ఉండగా వాటిలో దాదాపు 500 ఎలుగుబంట్లను చంపేందుకు పార్లమెంటు ఆమోదించింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పాపం యావత్త్ ప్రపంచం అంతా మూగజీవాల మీద ప్రేమలు చూపిస్తుంటే ...రొమేనియా ప్రభుత్వం మూగ జీవులను చంపేయాలని ప్లాన్ చేసింది. ఒకటి కాదు రెండు కాదు 481 ఎలుగుబంట్లను దాదాపు 500 ఎలుగుబంట్లను చంపాలని ప్లాన్ చేస్తున్నారు. దేశంలో దాదాపు 8 వేల ఎలుగుబంట్లు ఉండగా వాటిలో దాదాపు 500 ఎలుగుబంట్లను చంపేందుకు పార్లమెంటు ఆమోదించింది.
గత 20 ఏళ్లలో 26 మంది ఎలుగుబంట్ల దాడుల్లో చనిపోగా, 274 మంది తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా, 19 ఏళ్ల పర్వాతారోహకుడిపై దాడి చేయడంతో అతడు మరణించాడు. సాధారణ ప్రజలు కూడా ఈ ఎలుగుబంట్ల దాడులతో చాలా ఇబ్బందిపడుతున్నారని అందుకే 481 ఎలుగుబంట్లను ప్రభుత్వం హతమార్చింది.
ఎలుగుబంట్ల జనాభా గణనీయంగా పెరగడం వల్లే మనుషులపై దాడులు జరుగుతున్నాయని భావించిన ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నిరోధించేందుకు వాటిని చంపడమే మార్గమని నిర్ణయించింది. పార్లమెంట్ లోని దీని పై చాలా వేడి వేడి చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 481 ఎలుగు బంట్ల నుంచి చిన్నపిల్లలకు , సాధారణప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ ప్లాన్ చేశారు. గతేడాది కూడా 220 ఎలుగుబంట్లను ఇది వరకే ప్రభుత్వం హతమార్చింది.