మీ ఇంటి ముందు తులసి నల్లగా మారిందా..అయితే కష్టాలే.?

మన ఇండియన్స్ తులసి మొక్కను ఒక పవిత్రమైనటువంటి మొక్కగా భావిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క హిందువు ఇంటిముందు ఈ పవిత్రమైన మొక్క తప్పనిసరిగా ఉంటుంది. అంతేకాదు చాలామంది మహిళలు


Published Sep 06, 2024 07:22:59 AM
postImages/2024-09-06/1725587579_thulasi.jpg

న్యూస్ లైన్ డెస్క్: మన ఇండియన్స్ తులసి మొక్కను ఒక పవిత్రమైనటువంటి మొక్కగా భావిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క హిందువు ఇంటిముందు ఈ పవిత్రమైన మొక్క తప్పనిసరిగా ఉంటుంది. అంతేకాదు చాలామంది మహిళలు  ఈ తులసి మొక్కకు తప్పనిసరిగా పూజ చేస్తూ ఉంటారు. తులసిని లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. మొక్క ఎంత ఏపుగా పెరిగి ఎంత పచ్చగా ఉంటుందో మన ఇల్లు కూడా అంతా స్వచ్ఛంగా ఆర్థికంగా ఎదుగుతుందట..  అలాంటి తులసి మొక్క జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలను నివారించడంలో  ఎంతో ఉపయోగపడుతుందట.  

ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లుమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయట. అలాగే తులసి మొక్క ఇంటి ఆవరణంలో ఉంటే ఆహ్లాదకరమైనటువంటి గాలి మనకు వస్తుందట.  అలాంటి తులసి మొక్కను ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో ఆదరిస్తారు. అలాంటి తులసి మొక్క నల్లగా మారితే  మనకు అనార్థాలు జరుగుతాయట. ఆ వివరాలు ఏంటో చూద్దాం..  సాధారణంగా తులసి మొక్క ఎండిపోయిన నల్లగా మారిన మన ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు వస్తున్నాయని నమ్ముతారు. 

 దైవ కోపం:
ముఖ్యంగా మన ఇంట్లో ఏదైనా తప్పు జరిగితే దేవతలు కోపానికి వస్తే తులసి మొక్క నల్లగా మారుతుందని అంటుంటారు. కాబట్టి తులసి మొక్క ఎప్పుడు పచ్చగా ఏపుగా పెరిగితేనే మన ఇంట్లో అన్ని కులాసాగా ఉన్నట్టు భావించాలి. ఒకవేళ తులసి మొక్క నల్లగా మారిన కాస్త ఎండిపోయిన  కుటుంబంలో ఏదో కలంకం జరగబోతుందని, అనారోగ్య సమస్యలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. అదే ప్రతిసారి ఇలా అవుతుందని కాదు. ఒక్కోసారి సూర్యకాంతి లేకపోవడం మట్టిలో పోషకాలు లేకపోవడం వల్ల కూడా తులసి మొక్క నల్లగా మారుతుందట. అంతేకాకుండా ఆ మొక్కకు అవసరమైన దానికంటే ఎక్కువ నీరు పోసినా కానీ వేరు నల్లగా మారి మొక్క ఎండిపోయే అవకాశం ఉంటుందట. అంతేకాకుండా బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి కూడా ఆకులను చేరడం వల్ల నల్లగా మారిపోతుందట.

newsline-whatsapp-channel
Tags : news-line laxmidevi money home basil-plant black-colour

Related Articles