మోదీ రాష్ట్రపతి ద్రౌపది హిందువులు కాదని షాకింగ్ కామెంట్లు చేశారు.అధికారంలో ఉన్న సమయంలో గోవధను నిషేధించలేకపోయారని ఆరోపించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జ్యోతిర్‌మఠ్ శంకారాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి మరోమారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది హిందువులు కాదని షాకింగ్ కామెంట్లు చేశారు.అధికారంలో ఉన్న సమయంలో గోవధను నిషేధించలేకపోయారని ఆరోపించారు.
ఈ దేశంలో ఇప్పటివరకు రాష్ట్రపతులు, ప్రధానులుగా ఉన్నవారు ఎ వరూ హిందువులు కాదన్నారు. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచే గొడ్డుమాసం దేశంలోని పలు ప్రాంతాలకు అత్యధికంగా ఎగుమతి అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం చేతిలో ఉండి కూడా గోవధను ఆపలేకపోయారు. ఎందుకు హిందువుఅని చెప్పుకోవడం అంటూ కామెంట్ చేశారు.
దేశంలో గోహత్య కొనసాగుతుండడానికి అదే కారణమని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ మహంత్ యోగి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ గొడ్డుమాంసం ఎగుమతులు ఆ రాష్ట్రం నుంచే అత్యధికంగా ఉన్నాయని తెలిపారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపి ప్రజలకు ఇవ్వడం దారుణమని తెలిపారు.అది హిందువులను దెబ్బతీసే కుట్ర తప్ప మరోటి కాదన్నారు. దీనిపై త్వరగా దర్యాప్తు పూర్తిచేసి చర్యలు తీసుకోవాలని కోరారు.