వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 14,298 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జాబ్ కోసం చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. ప్రస్తుత రోజుల్లో జాబ్స్ కు విపరీతమైన కాంపిటీషన్ ఉంది. అందులోను గవర్నమెంట్ ఉద్యోగాలు మరీ కష్టంగా ఉన్నాయి. రైల్వేలో 14,298 టెక్నీషియన్ జాబ్స్ భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 14,298 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో 9,144 ఖాళీలు ఉండగా ఇప్పుడు మరిన్ని పోస్టులను పెంచి మొత్తం 14,298 పోస్టులను భర్తీ చేయనున్నది రైల్వే శాఖ. రైల్వే ఉద్యోగం కోసం చూసేవారికి ఇది చాలా మంచి అవకాశం. ఆర్ఆర్బీ జోన్ల వారీగా 14,298 టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. వీటిలో సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 959 ఖాళీలు ఉన్నాయి. పదవ తరగతి లేదా ఐటీఐ పాసై ఉండాలి. బీఎస్సీ, బీఈ, బీటెక్ పాసైన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 ప్రారంభ వేతనం ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ , ఎస్టీ , సర్వీస్ మెన్స్ , మహిళలు ట్రాన్స్ జెండర్ , మైనారిటీ , ఈ బీసీ అభ్యర్ధులకు రూ 250 ఇతరులకు 500గా నిర్ణయించారు. అర్హత , ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 02- నుంచి 16 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. డీటైల్స్ కోసం రైల్వే అఫిషియల్ వెబ్ సైట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది.