కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో 2024-2025 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి 729 భోధనేతర సిబ్బంది పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఉద్యోగం ఏదైనా క్వాలిఫికేషన్ మాత్రం భారీ గా అడుగుతున్న రోజులివి. కాని ప్రభుత్వ సెక్టార్ లో అది కూడా ఏ మాత్రం క్వాలిఫికేషన్ అవసరం లేకుండా కొన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే నమ్మడమే కష్టం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో 2024-2025 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి 729 భోధనేతర సిబ్బంది పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది.
హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే/నైట్ వాచ్ ఉమెన్, స్కావెంజర్, స్వీపర్, చౌకీదార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు కేవలం ఆడవారు మాత్రమే కావాలి. ఇంట్రస్ట్ ఉన్న వాళ్లు అక్టోబర్ 15వ తేదీ లోపు అప్లై చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తులను మంండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలి. హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్కావెంజర్, స్వీపర్ పోస్టులకు విద్యార్హతలు తప్పనిసరి కాదని ప్రకటనలో తెలిపారు.
డే/నైట్ వాచ్ ఉమెన్, చౌకీదార్ పోస్టులకు 7వ తరగతి పాసై ఉండాలి. అభ్యర్థులు వయోపరిమితికి వయస్సు రికార్డు షీట్/టీసీ/ఆధార్ కార్డు తప్పనిసరి. అభ్యర్థుల వయసు 42ఏళ్లకు మించకూడదు. కేజీబీవీలు ఉన్న ప్రాంతంలో నివసించే వారికే ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత ఆ మండంలో నివాసం ఉండేవారికి సెకండ్ ప్రయారిటీ.ఈ పోస్టుకు ఎంపికైతే నెలకు 15 వేల జీతం ఇస్తారు. అభ్యర్ధులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.