isro: ఇస్రో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ..నెలకు 2 లక్షల జీతం !

పోస్టులకు మాగ్జిమం 18 నుంచి 35 వరకు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయోసడలింపు ఉంటుంది.


Published Oct 08, 2024 07:19:00 PM
postImages/2024-10-08/1728395473_ISRO01.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నారా అయితే మీ కోసమే ఇది.ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. అది కూడా చిన్నా చితకా ఉద్యోగం కాదు. జస్ట్ రెండు లక్షల జీతంతో సూపర్ డూపర్ ఛాన్స్ కొట్టేయచ్చు.


ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మెడికల్ ఆఫీసర్-ఎస్డీ, మెడికల్ ఆఫీసర్-ఎస్సీ, సైంటిస్ట్ ఇంజినీర్-ఎస్సీ, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్-బీ, డ్రాఫ్ట్స్‌మెన్‌-బీ, అసిస్టెంట్ (అఫీషియల్ లాంగ్వేజ్) వంటి తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 103 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ప్రస్తుతానికి ఇవి అగ్రిమెంట్స్ ద్వారానే జరుగుతున్నాయి. కాని మీ పర్ఫామెన్స్ కాని బాగుంటే  పర్మినెంట్ అవుతుంది. అయితే దీనికి మీ ఏజ్ లిమిట్ ఎలా ఉండాలంటే .


 ఈ ఉద్యోగాలకు ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌ పూర్తి చేసి ఉండాలి. అన్ని పోస్టులకు మాగ్జిమం 18 నుంచి 35 వరకు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయోసడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ టెస్ట్ ఆధారంగా  ఎంపిక చేస్తారు. మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి 21, వేల 700 నుంచి 2 లక్షల 8 వేల 700 మధ్య వేతనం లభిస్తుంది. దరఖాస్తు ఫీజు జనరల్‌/ఓబీసీ అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అయితే ప్రాసెసింగ్ ఫీజు మాత్రం మరో 500 ఎక్కువ కట్టాల్సిందే.. పూర్తి సమాచారం కోసం isro.gov.in ను సంప్రదించాల్సి ఉంటుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jobs

Related Articles