బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ . బ్యాంకింగ్ సెక్టార్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ . బ్యాంకింగ్ సెక్టార్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. యూనియన్ బ్యాక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. భారీగా ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలను సాధించి లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నట్లైతే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. మీకోసం బ్యాంక్ జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి. అయితే యూనియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
మొత్తం 1500 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 200 పోస్టులు.. తెలంగాణలో 200 పోస్టులు భర్తీకానున్నాయి. ఈ పోస్టులకు కావాల్సినిందల్లా అభ్యర్ధి డిగ్రీ చెయ్యాల్సిందే. అభ్యర్థుల వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు, పీడబ్య్లూబీడీలకు 10 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్స్ కు 5 ఏళ్లు వయోసడలింపు వర్తిస్తుంది.
ఇప్పుడు ఈ ఉద్యోగానికి రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ జాబ్స్ కు ఎంపికైన వారికి దాదాపు 48 వేల 480 నుంచి 85 వేల 920 రూపాయిల వరకు జీతం వస్తుంది. అయితే ఓ బీసీ అభ్యర్ధులు 850 రూపాయిలు ధరఖాస్తు ఫీజు కట్టాల్సిందే.అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్ 24 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.