బ్యాంక్ ఆఫ్ బరోడా లో పోస్టులు పడ్డాయి. కరెక్్ట్ గా ట్రై చేస్తే అధ్భుతమైన లైఫ్ లీడ్ చెయ్యొచ్చు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలని యూత్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తక్కువ టైంలో ఫాస్ట్ గా సెటిల్ అయ్యే ఆప్షన్ బ్యాంక్ జాబ్స్ . కాస్త రిస్క్ ఉన్నా...హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. కోచింగ్ తీసుకొని పుస్తకాలతో కుస్తీ పడుతున్న స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్ . బ్యాంక్ ఆఫ్ బరోడా లో పోస్టులు పడ్డాయి. కరెక్్ట్ గా ట్రై చేస్తే అధ్భుతమైన లైఫ్ లీడ్ చెయ్యొచ్చు.
బీఓబీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 592 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ 140, డిజిటల్ గ్రూప్ 139, రిసీవబుల్ మేనేజ్ మెంట్ 202, ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ 31, కార్పోరేట్, క్రెడిట్ విభాగం 79, ఫైనాన్స్ 1, ఈ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ కానున్నాయి. అయితే రీజనల్ ఆఫీసులు, బిజినెస్ మేనేజర్ , జోనల్ లీడ్ మేనేజర్ , ఫ్లోర్ మేనేజర్ , సీనియర్ క్లౌడ్ ఇంజినీర్ ప్రొడక్ట్ మేనేజర్ తదితర పోస్టులు ఉన్నాయి.
ఈ జాబ్స్ కోసం పోటీపడే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎఫ్‌ఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష రాయకుండానే బ్యాంక్ జాబ్ సొంతం చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. 19 తారీఖున లాస్ట్ డేట్ . మరిన్ని వివరాల కోసం బ్యాంక్ వెబ్ సైట్ ను విజిట్ చేస్తే తెలుస్తుంది.