సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని ప్రాణాలకు సైతం తెగించి రీల్స్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు రోడ్డుమీద ఉండే సైన్ బోర్డుపైకి ఎక్కి పుల్‌అప్స్ చేశాడు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రీల్స్ పిచ్చి..ప్రాణం పోయినా పర్లేదు...లైకు లు , షేర్లు ...ఫేమ్ ..నేమ్ కావాలి ఇప్పుడు కుర్రాళ్లకు ఇదే నడుస్తుంది.తాజాగా ఈ పనిమంతులు ఏం చేశారో తెలిస్తే నోరు ఎల్లబెడతారు.
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని ప్రాణాలకు సైతం తెగించి రీల్స్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు రోడ్డుమీద ఉండే సైన్ బోర్డుపైకి ఎక్కి పుల్‌అప్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. ఒక్కరంటే ఒక్కరు కూడా క్రేజీ కామెంట్లు లేవు. అందరు తిట్ల దండకమే. ఒరేయ్ ఏందిరా ఇది ..పిచ్చి వెధవ అని హిందీలో, ఇంగ్లీష్ లో, వారి వారి భాషల్లో తెగ తిట్టేస్తున్నారు.
అమేఠీలోని జాతీయ రహదారి 931లో ఓ యువకుడు సైన్‌బోర్డు పైకి ఎక్కి పుల్ అప్స్ తీశాడు. నేల నుంచి 10 మీటర్లకు పైగా ఎత్తులో వేలాడుతూ స్టంట్లు చేశాడు. మరో యువకుడు కూడా పైకి ఎక్కి అతడిని వీడియో తీశాడు. ఏ మాత్రం చెయ్యి జారిన కిందపడి ..చస్తారు..పొరపాటున బ్రతికినా ..ఏ వెహికలో ..తొక్కి పడేస్తుంది. ‘‘రీల్స్ కోసం ప్రమాదక స్టంట్లు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూసినా..కుర్రాళ్లు మారడం లేదు. ఈ ఘటన పై ఉత్తరప్రదేశ్ పోలీసులు రియాక్ట్ అయ్యారు. విచారణ జరిపి అరెస్ట్ చేస్తామన్నారు.
#अमेठी:अमेठी की सड़कों पर खतरों के खिलाड़ी,किलोमीटर के सांकेतिक बोर्ड पर पुशअप करता नजर आया युवक,जान हथेली पर डालकर सड़क से 10 मीटर ऊपर बोर्ड पर पुशअप कर रहा युवक,सचिन नाम के इंस्टाग्राम आईडी से वीडियो किया गया है पोस्ट @amethipolice @DmAmethi pic.twitter.com/Qq5kCkgcCl — AMETHI LIVE (@AmethiliveCom) September 29, 2024