Anant Ambani: అంబానీ ఇంట ఏడు నెలల పెళ్లి సంబరాలు ..ఏం చేశారబ్బా ?

16 రోజల పెళ్లి వేడుకలు అంటేనే ..ఓరి నాయనో..ఏం చేస్తాం 16 రోజులు అంటున్నాం. అలాంటిది అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు ఏడు నెలలుగా పెళ్లి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి . ప్రతి ఆరువారాలకు ఓ ఫంక్షన్ చేశారు. అవేంటో చూద్దాం.ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం నేడు అంగరంగ వైభవంగా జరగబోతోంది.  దాదాపు డిసెంబర్ నుంచి జూలై వరకు ప్రతి నెల ఏవో వేడుకలు చేస్తూనే ఉన్నారు.


Published Jul 12, 2024 01:31:40 AM
postImages/2024-07-12/1720765500_118903865879941111111updates.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  16 రోజల పెళ్లి వేడుకలు అంటేనే ..ఓరి నాయనో..ఏం చేస్తాం 16 రోజులు అంటున్నాం. అలాంటిది అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు ఏడు నెలలుగా పెళ్లి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి . ప్రతి ఆరువారాలకు ఓ ఫంక్షన్ చేశారు. అవేంటో చూద్దాం.ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం నేడు అంగరంగ వైభవంగా జరగబోతోంది.  దాదాపు డిసెంబర్ నుంచి జూలై వరకు ప్రతి నెల ఏవో వేడుకలు చేస్తూనే ఉన్నారు.

* ఉత్తర రాజస్థాన్‌లోని ఓ ఆలయంలో గతేడాది డిసెంబర్ 29న అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ నెలంతా ఎంగేజ్ మెంట్ ఏర్పాట్లు, డ్రెస్ డిజైన్లు, ఈవెంట్ మేనేజర్లు, చీరలు , నగలు ..పార్టీలు అబ్బో మామూలు హంగామా కాదు. అలా డిసంబర్ గడిచింది.


* జనవరి 18న వధువు రాధిక మర్చంట్‌కు మెహందీ వేడుక నిర్వహించారు. ఆ తర్వాతి రోజు ‘గోల్ ధన’ నిశ్చితార్థ వేడుక జరిపారు. బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్, దీపిక పదుకొణె, రణ్‌వీర్ సింగ్ తదితర స్టార్లు హాజరయ్యారు.  డిసంబర్ లో జరిగిన..ఎంగేజ్మెంట్ కు ఈ జనవరి అంతా ట్రెడిషనల్ పధ్ధుతుల్లో సెలబ్రేషన్స్ చేశారు.


* గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్వహించిన ప్రి వెడ్డింగ్ పార్టీకి దాదాపు 1200 మంది అతిథులు హాజరయ్యారు. ఈ ఫంక్షన్ అయితే ధూం ధాం చేశారు. ఊరంతా భోజనాలు ...100 మంది చెఫ్ లు , 500 వంటకాలు వడ్డించారు. హాలీవుడ్ , బాలీవుడ్ , ఇవాంకా , బిల్ గేట్స్ ...చాలా మంది ప్రముఖులు భారత్ లో ఈవెంట్ కు వచ్చారు. 


* అంబానీ కుటుంబం రోమ్‌లోని ఓ విలాసవంతమైన షిప్‌లో పార్టీ చేసుకుంది. సిసిలియన్ నగరమైన పలెర్మోర్‌లో ప్రారంభమైన షిప్ నాలుగు రోజుల అనంతరం రోమ్‌‌కు చేరుకుంది.  ఈ ఈవెంట్ లో ఫోన్ తీసుకెళ్లనివ్వలేదు. అయినా పార్టీ పిక్స్ అన్నీ ..బయటకు వచ్చేశాయి.


* జులై 2న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జంట ముంబైకి 70 మైళ్ల దూరంలోని పాల్ఘడ్‌లో 50కి పైగా నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించింది.  పెళ్లి అయిన వారికి ఏడాది పాటు సరిపోయే కిరాణా సామాగ్రి నుంచి బంగారు ఆభరణాల వరకు అన్నీ బహుమతులు ఇచ్చారు. 


* కొన్ని రోజులకు నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో సంప్రదాయ మ్యూజిక్, డ్యాన్స్ నైట్ నిర్వహించారు. జస్టిన్ బీబర్ ప్రదర్శన ఇచ్చాడు.


* అనంత్, రాధిక జంట సోమవారం హల్దీ వేడుకలో పాల్గొంది. ఈ వేడుకను ప్రైవేట్‌గా జరుపుకున్నారు. ఈ వేడుకలో సెలబ్రెటీస్ అందరు ...నీతా ఫ్యామిలీ...పెద్ద కోడలు శ్లోకా ఫ్యామిలీ ఫుల్ హల్దీ రాసుకొని తెగ ఎంజాయ్ చేశారు. రాధిక దుస్తులను భారతీయ డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించగా, వరుడు అనంత్ కుర్తా, జాకెట్‌ను సందీప్ ఖోస్లా డిజైన్ చేశారు.


* ఈ రోజు పెళ్లి..16 వేల మంది సరిపోయే జియో కన్వెన్షల్ హాల్ లో ..పూర్తి రెడ్‌కార్పెట్ తరహాలో వివాహం జరగనుంది. అడిలె, డ్రేక్, లానా డెల్ రే పర్ఫామెన్స్ ఉంటుందని టాక్. అంబానీ ఫ్యామిలీ ఏం అనౌన్స్ చెయ్యలేదు. 


* నేడు వివాహం జరగనుండగా రేపు వివాహ ఘట్టంలోని చివరి దశ జరగనుంది. శుభ్ ఆశీర్వాద్‌గా పిలిచే దైవిక ఆశీర్వాద వేడుక రేపు (శనివారం) జరగనుంది. పెద్దలందరితో ఆశీర్వాదం పొందుతారన్నమాట.


ఏడు నెలలపాటు సదీర్ఘంగా జరిగిన వివాహ వేడుక ఆదివారం రిసెప్షన‌తో ముగియనుంది. ఈ కార్యక్రమం ..27 అంతస్తుల నివాసం యాంటిలియాలో జరుగుతాయి. ఇలా ..దాదాపు డిసంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 7 నెలలు ..పెళ్లి పనులు జరుగుతూనే ఉన్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu wedding ananth-ambani

Related Articles