ఈ జాబితాలో కత్తెర, నైట్ స్టిక్, తాడు, కొలిచే టేప్, ఎండిన కొబ్బరి, బ్లేడ్, గొడుగు, అగ్గిపెట్టె లాంటివి తీసుకెళ్లనివారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు చాలా ఆంక్షలు , నియమాలు ఉంటాయి. ముఖ్యంగా విమానయాన సంస్థలు విమాణ ప్రయాణం చేసేటపుడు కొన్ని వస్తువులు తీసుకెళ్లనివ్వరు. ఈ జాబితాలో కత్తెర, నైట్ స్టిక్, తాడు, కొలిచే టేప్, ఎండిన కొబ్బరి, బ్లేడ్, గొడుగు, అగ్గిపెట్టె లాంటివి తీసుకెళ్లనివారు.
కత్తులు, మొబైల్ బ్యాటరీలు వంటి పదునైన వస్తువులు, లైటర్లు వంటి మండే వస్తువులను తీసుకెళ్లడం నిషేధించారని మనందరికీ తెలుసు. వస్తువులతో పాటు కొబ్బరికాయను తీసుకెళ్లడం ఎందుకు నిషేధించారో చాలా మందికి కొన్ని విషయాలు తెలీవు. కావాలని పట్టుబట్టి మరీ హ్యాండ్ లగేజీ లో చాలా ఐటమ్స్ తీసుకెళ్లిపోతారు.
విమానాశ్రయంలో ద్రవ వస్తువులను తీసుకెళ్లడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి. కొబ్బరిలో ద్రవం ఉంటుంది. కాబట్టి, దీనిని విమానంలో తీసుకెళ్లకూడదు. కొబ్బరి లోపల నుండి తేమగా ఉంటూ బయట గట్టిగా ఉంటుంది. ఎక్కువ నూనె కలిగి ఉంటాయి. అవి త్వరగా మంటలను అంటుకుంటాయి. అవి త్వరగా మంటలను అంటుకుంటాయి. విమానం లోపల వేడి పరిస్థితుల్లో ఇది అగ్నికి కారణం కావచ్చు.
లేదా పేలే ప్రమాదం ఉన్నాయి. కొబ్బరి ముక్కలు చేస్తే పర్లేదు. కొబ్బరి కాకుండా, చేపలు, మాంసం, సుగంధ ద్రవ్యాలు, మిరపకాయలు, ఊరగాయలు వంటి బలమైన వాసన కలిగిన ఆహార పదార్థాలను క్యాబిన్ బ్యాగుల్లో అనుమతించరు. అందరికి ఆ వాసన నచ్చకపోవచ్చు. ఎవరైనా అభ్యంతరం చెప్పవచ్చనే విషయంపై ఘాటుగా ఉన్న వాటిని అసలు అలౌ చెయ్యరు.