Microplastics: జంతువుల కంటే మనుషుల కడుపులోనే ఎక్కువ ప్లాస్టిక్ !

న్యూ మెక్సికో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 23 మంది పురుషులు 47 కుక్కల వృషణాల నుంచి కణజాలాలను సేకరించారు


Published Jun 16, 2025 01:38:00 PM
postImages/2025-06-16/1750062330_male.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా చాలా జంటలు సంతానలేమితో బాధపడుతున్నారు. చాలా యేళ్లుగా దీనికి కారణాలేంటో పరిశోధనలు జరుగుతున్నాయి కూడా.ప్రతి ఆరుగురిలో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుండగా, తాజాగా పురుషుల వృషణాల్లో మైక్రోప్లాస్టిక్స్ చేరడం సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఇటీవలి అధ్యయనం తేల్చింది.
న్యూ మెక్సికో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 23 మంది పురుషులు 47 కుక్కల వృషణాల నుంచి కణజాలాలను సేకరించారు. దీనిని మనుషుల వృషణాలతో పోలిస్తే మానవ వృషణాల్లోనే దాదాపు మూడు రెట్లు ఎక్కవగా మైక్రో  ప్లాస్టిక్ ఉన్నట్లు కనుగొన్నారు.


ప్యాకేజింగ్ వస్తువులు, ఆహార పదార్థాలు, పైపులు, ఇతర రోజువారీ వస్తువులలో వాడే పాలిథీన్, పాలీవినైల్ క్లోరైడ్ వంటి సాధారణ ప్లాస్టిక్‌లు ఈ కణజాల నమూనాలలో కనిపించాయి. ఈ మైక్రో ప్లాస్టిక్స్ తల్లిపాలల్లో , మగవారి కణజాలాల్లో కూడా ఉండడం వల్ల సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని దెబ్బ తీస్తున్నాయనేది శాస్త్రవేత్తల వాదన . కుక్కల కణజాలంలో పాలీవినైల్ క్లోరైడ్ అధికంగా ఉండటం, వాటిలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటాన్ని గమనించారు. మైక్రోప్లాస్టిక్‌లు ఎండోక్రైన్ వ్యవస్థకు అంతరాయం కలిగించడం వల్లే ఇలా జరుగుతోందని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే ఏ ఏ దేశ జనాభాకు ఎంత స్థాయిలో ఉందనే పరిశోధనలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి . కాని సంతాన లేమికి మైక్రో ప్లాస్టిక్ ్పరధాన కారణం అని అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu life-style kids

Related Articles