Brush: పొద్దున్నే బ్రష్ చేస్తున్నారా.. ఇలా చేస్తే డేంజరే.?

చాలామంది ఉదయం లేవగానే తప్పనిసరిగా బ్రష్ వేసుకుంటారు. అలా వేసుకొని కొంతమంది  కొన్ని నిమిషాల పాటు గడుపుతారు. అలాగే నోట్లో పెట్టుకుని  ఇతర పనులు కూడా చేస్తారు. బ్రష్ వేసుకొని మనం ఎంత సేపు తోముకోవాలి


Published Sep 19, 2024 07:41:13 AM
postImages/2024-09-19/1726711873_brushing.jpg

న్యూస్ లైన్ డెస్క్: చాలామంది ఉదయం లేవగానే తప్పనిసరిగా బ్రష్ వేసుకుంటారు. అలా వేసుకొని కొంతమంది  కొన్ని నిమిషాల పాటు గడుపుతారు. అలాగే నోట్లో పెట్టుకుని  ఇతర పనులు కూడా చేస్తారు. బ్రష్ వేసుకొని మనం ఎంత సేపు తోముకోవాలి. ఎక్కువసేపు బ్రష్ చేసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ప్రస్తుత కాలంలో అన్ని మోడ్రన్ అయిపోయాయి.

ఒకప్పుడు చాలామంది వేప పుల్లను బ్రష్ లా వాడేవారు. అందులో ఉండే ఔషధ గుణాలు కేవలం పళ్ళను శుభ్రంగా ఉంచడమే కాకుండా  జీర్ణక్రియను కూడా మెరుగుపరిచేవి.  అలా పొద్దున్నే వేసుకోవడం వల్ల శరీరం అంతా శుభ్రమై  వాళ్లు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవించేవారు. కానీ కాలం మారినా కొలది టెక్నాలజీ మన జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. దీంతో చిన్న చిన్న పల్లెటూర్ల నుంచి మొదలు పెద్ద పెద్ద పట్టణాల వరకు ప్రతి ఒక్కరి ఇంట్లోకి బ్రష్ పెస్ట్ వచ్చింది. పొద్దున లేవగానే ఆ బ్రష్ వేసుకొని  తోముతూ ఉంటారు.

అలాంటి బ్రష్ మనం ఎన్ని నిమిషాలు వేసుకోవాలనేది చాలామందికి తెలియదు. కొంతమంది పళ్ళు తెల్లగా కనిపించడం కోసం  అద్దంలో చూసుకుంటూ మరి ఎక్కువసేపు బ్రష్ వేసుకుంటారు.  కొంతమంది పళ్ళు ఊడిపోయేలా బలంగా బ్రష్ తో తోముకుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని దంత వైద్య నిపుణులు అంటున్నారు. ఎక్కువసేపు  బ్రష్ చేయడం వల్ల వంటిపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోతుందట. పళ్ళు సెన్సిటివ్ గా మారి జివ్వుమని లాగుతాయట.

కాబట్టి కేవలం రెండు నుంచి మూడు నిమిషాల్లోనే బ్రష్ వేయాలని  దంత వైద్య నిపుణులు అంటున్నారు. ఇక నిద్ర లేచాక బ్రష్ చేయడమే కాకుండా నిద్రపోయే ముందు కూడా  అలా ఒక నిమిషం పాటు బ్రష్ వేస్తే పళ్ళు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా  ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని తెలియజేస్తున్నారు. ఇక దీనికంటే  బెటర్ ఆప్షన్ పొద్దున బ్రష్ తో తోముకొని సాయంకాలం వేప పుల్ల లాంటి వాటితో తోముకొని శుభ్రం చేసుకుంటే ఇంకా మంచిదని దంత వైద్య నిపుణులు అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-news morning brush teeth enamel

Related Articles